Thursday, August 23, 2007

మొహమాటమా? లేక గ్రహచారమా?

"కంతుల తోటలో పూచిన జాబిలి నీవని.. ఆఆ.. ల ల లా...", కొత్తగా release అయిన దుబ్బింగ్ సినిమా పాట ఎంతో ఇదిగా పాడుతున్నాడు కిషోర్.

"నీ భాషా మండినట్టే ఉంది, కంతులేమిట్రా నీ మొహం! కాంతులు అనలేవు? కంతులంటే ఏమిటో తెలుసా? ఒంట్లో వచ్చే గడ్డలు రా సన్నాసి! అదొక రోగం.

నన్ను తిడతావేమిటి తాతయ్య? సినిమా లో కూడా ఆ పాట అలాగే పాడారు. అంత తప్పు అయితే మరి ఆ సంగీత దర్శకుడు సరిదిద్దాలి కదా?

నిజమా? అలా ఎలా పాడారురా? అంత తప్పుగా?అయ్యొ వీళ్ళ తెలివి తెల్లారినట్టే ఉంది. అయిన ఒకళ్ళనని ఏమి లాభం లే, మన సినిమా పేరుకి మాత్రమే 'తెలుగు సినిమా'!!నటులు తెలుగు వారు కారు! దర్శకులు తెలుగు వారు కారు, పాడే వారు తెలుగు వారు కారు, పాడించే వారు తెలుగు వారు కారు. ఎవడికేమి పట్టింది? మాకాలం లోనూ ఇతర భాషల వారు తెలుగులో పాటలు పాడేవారు, వాళ్ళని అరగదీసి మరీ స్పష్టం గా పాడించే వారు. ఆ రొజులే పొయాయి. ఈ రొజున భాష బూజు పట్టి పోయింది. అసలు తెలుగు వాళ్ళే తెలుగుని మర్చిపోతుంటే, అక్షరాలెన్నో తెలియదు, రాయటమెలాగో అంతకన్నా చేతకాదు!
ఇప్పాట్టి పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి కూడా కాదు. దాని స్థానే french అని, spanish అని optionals వచేశాయి. ఇక భాష ఎవరురా నేర్చుకునేది? కొన్నేళ్ళాకి అదిగో ఆ రాక్షస బల్లుల్లా తెలుగు కూడా అంతర్ధానమయిపోతుంది. మీ తరువాతి తరాలు, ' ఇదిగో ఇక్కడే తెలుగు అనే భష ఒకప్పుడు వాడుక భాషగా ఉండెదీ అని చెప్పుకుంటారేమొ, విడ్డూరం!

అబ్బా , ఒక్క పాటకే ఇంత బాధ పడతావేమి తాతయ్య? అలా ఏమి జరగదు. తెలుగు నేర్చుకుంటున్న వారు ఉన్నారు. ఇంక అందులో specialise అవ్వాలనుకునే వారు ఉన్నారు. కాకపోతే డబ్బు ముందు, దబ్బింగ్ ముందు, పాపం తెలుగు తల్లి చేతిలో కలశం కింద పెట్టేసి దిగులుగా మౌనం గా ఉండిపోయింది. అంతేనా? నన్ను పట్టించుకునే నాధుడే లేడా అని ఎంతో దీనం గా ఘోషిస్తోంది. పేరుకి ఈ సెన్సార్ బోర్డ్ వారున్న, వారు ఈ తప్పులు తడికలు పెద్దగా పట్టించుకోవటంలేదు.

లేదురా, నీకు విషయం అర్ధంకావటంలేదు. అన్ని జన్మలలో మనిషి జన్మ ఉత్కృష్టమయినది. మాట్లాడ గలగటం ఒక్క మనిషికే చెల్లింది. మనసులోని మధుర భావాని బయటికి తేనెలురే తేటతెలుగులో ప్రకటించగలగటం పూర్వ జన్మ సుకృతం. దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నారు. ఎందరో విదేశీయులు కూడా మన దేశానికి వచ్చి మరీ మన భాష నేర్చుకోవటనికి ఎంతో ఉత్సాహం చూపుతారు. italian of the east గా పిలువబడే అంత గొప్ప భాష కి ఇంత దౌర్భాగ్యం పట్టటం చాలా విచారకరం. ఈ దబ్బింగ్ సినిమా ల విషయంలో మనమే దీనిని తీవ్రంగా ఖండించాలి కొంచెం తీవ్రంగా కృషి చేయాలి. భాష సరిగ్గా ఉండేట్టు తగిన శ్రద్ధ తీసుకోవాలి. తప్పులని తడికలని గుర్తించి, ఆయా ఇతర భాషల వారికి సున్నితంగా వివరించాలి. ఇతర భాషల వారిని పాడవద్దు అనటం లేదు, కానీ మాన భాష ని సరిగ్గా ఉచ్ఛరించమంటున్నాం. ఇది మన ఉనికికే ముప్పు తెచ్చే విషయం. కనుక ముందుగానే జాగ్రత్త పడాలి.