Wednesday, March 21, 2007

గ్రహణం - A review




'గ్రహణం'
పేరు విని ఏదో దయ్యాల సినిమా అనుకున్నాను. కాని , కాదు ! చలం గారి రచన. ఆహా ఎన్నాళ్ళాకి మన దర్శకులకి కళ్ళు తెరుచుకున్నాయో? routine గా మనం వినే dialogue కదా, "అసలు touch చేయని point" , "ఎవరూ తీయని subject" అని. ఏ దర్శకుడి interview చూసిన ఈ వాక్యం లేకుండ interview పూర్తి చేయరు! ఝాన్సి ఈ point ,'talk of the town' లో touch చేసిందో లేదో గుర్తు లేదు నాకు, కాని తప్పకుండా ప్రయత్నించాలి. ఒకరు ఒక కొత్త subject మొదలు పెదితే, ఇంక అందరూ అదే పట్టుకొని పాకులాడతారు. కొత్తదనంలో variety కరువైపోయి0ది. పోని వీళ్ళ బుర్రలకి ఏమీ తట్టక పోతే , మహానుభావుల రచనలైన తీయచ్చు గా అనుకునేదాన్ని! ఇప్పటికి సాధ్య పడింది.
మొన్నా మధ్య దూరదర్శన్ లో కాంతం కధలు కూడా తెరకెక్కించారు. ప్రాణానికి ఎంతో హాయిగ అనిపించింది. నటీనటులకు తమ అసలు ప్రతిభ కనబరిచే అవకాసం ఇచ్చినట్టైంది. ఈ 'గ్రహణం' సినిమా చూసినా అలాగే అనిపించింది.
మొదటి సారిగా 'జయలలితా గారిని శృతిలయలు సినిమా లో చూశాను. చక్కని చాయ, పొడవాటి సిరోజాలు, మంచి ఉచ్చారణ, స్త్రీత్వం మూర్తీభవించినట్టు ఉందీవిడ అనుకున్నాను. కాని మన దురదృష్టం, ప్రతిభను సరిగ్గా వాడుకోవటం కూడా చేతకాని దరశకులని మనవాళ్ళానే అనుకోవాలి. ఆవిడ నటించిన సినిమాలన్నిట్లో ఆవిడకి అశ్లీలత, అసభ్యత అప్పజెప్పారు. ఇన్నాల్టికి ఒక మంచి పాత్ర లో కనిపించారు. నిండుగా ఉన్నారు.
తనికెళ్ళా భరణి గారు చాలా సహజంగా నటిస్తారు. ఆయన కూడా తన పాత్ర కి పూర్తి న్యాయం చేకూర్చారు. మిగతా నటీనటులు కూడా చాలా చక్కగా అభినయించారు. మొత్తానికి సినిమా చాలా బావుంది. అతి సులువైన తెలుగు కూడా పలుకలేని వేరే భాషల heroines ని చూస్తే, ఏదో dubbing సినిమా చూస్తున్న భావన కలుగుతున్నది. ఎంతో మంది ప్రతిభావంతులు మన గడ్డ మీదే ఉన్నారు. వాళ్ళని వెలికి తీయల్సిన బధ్యత మన దర్శకులది.

ఇప్పుడు next duty ప్రేక్షకులుగా మనది..

factionist సినిమాలని, అశ్లీలత ను ఎలా స్వీకరిస్తున్నామో , అలాగే ఇలాంటి మంచి సినిమాలని కూడా ఆదరించటం నేర్చుకుందాం. కనీసం అలాగైనా ఇలాంటి సినిమాలకి ప్రోత్సాహం లభిస్తుంది. మంచి నటన చూసే అవకాసం కూడ ఉంటుంది.
హింది art cinema దేశమంతా చూస్తారు. జాతీయ అవార్డులు కూడా ఇస్తారు. oscars కి nominate చేస్తారు. మరి మన తెలుగు సినిమాలకి ఆ శుభఘడియలెప్పుడు? 'ఆ నలుగురూ', 'అనుకోకుండా ఒక రోజు' ఇలాంటి విలక్షణమైన కధలకి గుర్తింపు రావాలి. ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

జై తెలుగు సినిమా!