Sunday, January 10, 2010

ఎక్కడికీ ఈ పయనం?

"చాల్లెంజ్" .. మా టీవీ లో ఈ కార్యక్రమం ఎవరైనా చూశారా? పోనీ కనీసం దాని ట్రయిలర్ అయినా చూశారా?
చూసి ఉండకపోతే మీకో చిన్న స్యాంపల్ ఇదిగో..

" నా కాళ్ళకి వంగి దండం పెట్టినా నీ రుణం తీరదు" , "చాలమ్మ, నీకంత సీను లేదు!", ఒక న్యాయ నిర్ణేతా స్థానం లో ఉన్న వ్యక్తి కళాకారుడితో అనే మాటలివి.
అదొక్కటే కాదు. ఇంక భాష లో, భావం లో, అవధులు దాటిన అసభ్యత యేరులై పారుతుంది ఆ కార్యక్రమంలో.
కల్మషం, పైశాచికత్వం, కట్టలు తెంచుకున్న క్రౌర్యం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బ్లాగు అంతా సరిపేమొ..లేక నాకు తెలిసిన తెలుగు పదాలు సరిపోవేమొ..ఇవి నేడు మనకు టీవీ కార్యక్రమాలలో దర్శనమిస్తున్న తంతు.

ఒక పక్క ఆ అయిడియా సూపర్ సింగర్ కార్యక్రమం. అదొక చెత్త లా తయారయ్యింది. అందులో అయితే మరీ దారుణం. న్యాయ నిర్ణెతలే ఒకళ్ళతో ఒకళ్ళు అగౌరవంగా మాత్లాడుకోవటం, నేరాలు ఎంచుకోవటం, వారి వారి అహాలను అందరి ముందు సంతృప్తి పరచుకోవటానికి విచక్షణా రహితంగా నోతికొచ్చినట్టు మాత్లాడుకోవటం.. పరమ చిరాకుగా తయారయ్యింది వ్యవహారం. ఇదంతా ప్రేక్షకులకి వినోదం అనుకుంటున్నారనుకుంట!
జంధ్యల గారే బతికుంటే ఎన్ని నూతన పాత్రలకి రూపకల్పన చేసి ఉండేవారో?? ఆయన కూడా ఒక్క క్షణం హన్న! అని ముక్కున వేలేసుకొనే వారు.
అంత విచిత్రంగా ఉంది ఈ కార్యక్రమాల ధోరణి!

ఎడిటింగు అనేది మర్చిపోయినట్టు ఉన్నారు నిర్వాహకులు? లేక కావాలనే ఈ తంతు అంతా మనకు ప్రసారం చేస్తున్నారా? ఏమిటి దీని లోని మర్మం అని ఎంత ఆలోచించినా అర్ధం కావటంలేదు.
ఇదంత సభ్య సమాజం లో నేర్చుకోవలసిన అవసరమైన విద్య? ఇదేనా మీడియా మనకు నేర్పేది? పిల్లలు ఆ ప్రోగ్రములు చూసి అదే ధోరణి నేర్చుకొని, మన మీద ప్రయోగిస్తే మనం దాన్ని స్వీకరించగలమా?

బోడి టీవీ ని అనుకొని ఏమి ప్రయోజనం? ఒకపక్క ప్రజలను పాలించే నాయకులే పబ్లిక్కుగా భయంకరమైన బూతులు మాత్లాడుతుంతే?
యధ రాజా తధ ప్రజా అని ఊరికే అన్నారా?
ఇక పై భవిష్యత్తు క్లాసు పుస్తకాలలో 'వాడుక భాష ' అని ఒక కొత్త సబ్జెక్టు మొదలు పెట్టాలేమొ? అందులో ఒక్కొక్క పాఠం, ఒక్కో ప్రాంతీయ భాషలోని బూతులు, ద్వంద్వార్ధాలు చేర్చాలెమొ? అతిసయోక్తి కాదు.. నిష్టూరమైన నిజం ఇది.
ఎవరు ఎవరిని ఎంత బాగా తిట్టొచ్చు, ఎంత లెవెలుకి అగౌరవ పరచవచ్చు? లేక అవతలి వాళ్ళ ఓర్పు తో పని లేకుండా ఎంత వరకు అహం ప్రదర్శించవచ్చు? ఇలాంటివి కూడా నేర్పితే, ఇంకా బావుంటుంది.
ఇదంత 'కల్చఋ అని మర్చిపోకుందా చెప్పలి.

ఇదే మన 'కల్చరు అని మర్చిపోకుండా చెప్పాలి. సినిమలు అంటే, రాజకీయం అంతే, ఆహ్లాదం కోసమై ఉన్న ప్రాయొజిత కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు, డయిలీ సీరియళ్ళు అంతే, ఎందులో ఈ ధోరణి లేదో అడగండి?
చ, టీవీ పెట్టాలంటే చిరకు వస్తోంది. అన్నీ, అందరూ, ఇంత నీచ స్థిథికి దిగజారి పోవటానికి స్ఫూర్థి ఏంటో, ఎవరో?