Thursday, November 15, 2018

పునాది రాళ్ళు


టైటిల్: పునాది రాళ్ళు

                                క్యాప్షన్: పెద్ద హీరో మొదటి సినిమా స్టోరీ కాదు..!

వివాహ బంధానికి నూరేళ్ళు హాయిగా వర్ధిల్లడానికి ముఖ్యంగా కావల్సినవి ఒకరిమీద ఒకరికి 'నమ్మకం, గౌరవం'...అంది బాపు-రమణలపెళ్ళి పుస్తకం.

అఫ్కోర్స్ పాయిరం, అక్కర కూడా కావల్ననుకోర్రి..

వీటన్నిటితోపాటు ఇంకా ముఖ్యంగా కావల్సినవి మన పునాది రాళ్ళు’..!!

ఒక సుమీత్ మిక్సీ, ఒక ప్రెస్టీజ్ ప్రెస్షర్ కుక్కర్, ఒక ఇస్త్రీ పెట్టి, వేయటం వచ్చినా రాకున్నా..ఒక అట్ల కాడ, ఒక దోసెల పెనం ఇద్దరి పేర్లున్న ఒక నేం ప్లేట్...వాకిలికి ఒక వాడని తోరణం!

చిన్నా చితకా లిస్ట్లో ఒక హస్తం, ఒక చాప, ఒక పులుస్ గరిటె, ఒక పెరుగు గిన్నె..ఒక బుడ్డి.., ఇలా ఇంకా చాలా ఉన్నయి.. కానీ పునాది రాళ్ళ నిజంగా పునాదికి సోపానాలే..
కారణం మెల్లగా మీకే అవగతమవుతుంది.~!
[ఈ చిన్న చితకా లిస్ట్ లో ఏమైన పోయినా కొంత పాటి తేలిక హృదయంతో కొనుక్కోగలమేమో కానీ, పునాది రాళ్ళల్లో ఏ ఒక్కటి పోయిన ఇంక అంతే సంగతులు..[.. అదే అదే బ్రాకెట్ ఎటు వైపున మూయాలో కూడా తెలియని అయోమయం లో పడతాం అన్నమాట! ]

నిన్న ఒక చిన్న సైజు ఘోర ప్రమాదం జరిగింది.. మదర్స్ డే వస్తోంది కదా.. నీకు ఎందుకోయ్ శ్రమా ..చూడు నా ఇస్త్రీ నేనే ఎంత చక్కహా చేసుకుంటానో అని.. నాకు  పని తగ్గించేద్దామని మా శ్రీవారు విజ్రుంభించి.. ఇస్త్రీ కి రంగం సిద్ధం చేసుకున్నారు..(ఆ అంతా ఉత్తిదే.. చేయి ఖాళీ లేక ఒక నాలుగు బట్టలు ఎక్కువ చేరాయి డ్రమ్ములో.. రేపేమో ఆఫీసులో పై అధికారులొస్తున్నారు తనిఖీకి...అదీ ట్రూ స్టోరీ..: నే చెప్పానని చెప్పకండీ! ఉష్ష్ గప్ చుప్ సంబార్ బుడ్డీ..!)

మగవారు మార్స్ నించి దిగారని.. ఆడవారు వీనస్ నించి దిగారనన్నీ ఎపుడో.. ఎక్కడో చదివిన జ్ఞాపకం!
వీరు ఆలొచనా తీరు వారికర్ధంకాదు.. వారి పని చేసే వైనం వీరికర్ధం కాదోచ్! అది నార్మల్! నథింగ్ టు వరీ అబౌట్!

వంకర టింకరగా ప్లగ్ లో వైరు వేళ్ళడుతూ అలాగే అతి జాగ్రత్తగా తంటాలు పడుతూ ఇస్త్రీ కానిస్తున్నారాయన. దీనికి తోడు ఇన్స్పిరేషన్ కోసం టివీ లో లెజెండ్సినిమా ఒకటి మాకు బ్యాక్గ్రౌండ్ మ్యూసిక్ లా..!
మా బాబ్జీ గాడి నలిగిపోయిన లాల్చీ ఒకటుందని గుర్తొచ్చి.. అదొక్కటీ నే చేస్తానని..మధ్యలో దూరను నేను.. (అలా పని మధ్యలో అడ్డు పడకూడదని తరవాత తెలిసింది!) ఆ వంకర టింకర సామ్రాజ్యం లో నేను ఇమడలేకపోయానని ఇస్త్రీ పెట్టి తేల్చేసింది! ఢాం అని పెద్ద శబ్దం చేస్తూ నేలకొరిగింది- తాను కూచ్చున్న కొమ్మని తానే నరుకున్న చందంగా తన వైరు తనకే అడ్డొచ్చి! ఇటు వంటింట్లోంచి నచ్చని వాసనేదో వచ్చింది...మాడిపోయిన బెండకాయ కూర కావాలు..! ముల్లు పోయే కత్తిపోయే ఢాం ఢాం ఢాం~

ఆ బుంజీ జంప్ చేశాక ఎంత ప్రయత్నించినా మా ఇస్త్రీ పెట్టె వేడెక్కనని మొరాయించింది. 
ఒక పునాది రాయి.. హయ్యో..
నేను హైదరాబద్ వచ్చినప్పుడల్లా మా ఆస్థాన ప్రెస్టిజి వాడు ఎక్ష్చేంజ్ ఆఫర్ అని ఎన్ని సార్లు చెవులుహోరెత్తించినా - నా కుక్కర్ ని మార్చలేదు.
ఎంతో మధన పడి ఒక సారి బేస్ అరిగిపోయిందని మార్చడానికి బయల్దేరాను. మధ్య దారిలోనే మా రాజలింగం ఆటోని వెనక్కి తిప్పించేశాను. హ్యాండిల్ పీకేస్తే కనీసం ఏ ఇడ్లీ పిండి కో పనికివస్తుందనే పునరావాస తలంపుతో!

ఫతేమైదాన్ క్లబ్ దగ్గరున్న సుమీత్ మిక్సీ వాడైతే నన్ను ఏకంగా గుర్తు పెట్టేసుకున్నాడు. మిక్సీ జార్లకి స్పేర్లు  కొన్నాననే కాదు.. వ్రతి లాగ దాన్నొకసారి సర్వీసుకి తీసుకెళ్తూ ఉంటాను.. మా తాతయ్య స్కూటర్ కి ఆయిల్ చేంజ్, స్పార్క్ ప్లగ్ క్లీనప్ లాగా..! అమ్మా ఇది మీ మనవల కాలం దాక కూడా ఏ ఢోకా లేకుండా పని చేస్తుంది మీరు చూపుతున్న శ్రద్ధకి అని హామీ ఇచాడు మా మల్లేస్!

ఎందుకైన మాంచిదని ఒక తాయత్తు కూడా కట్టాను దానికి!
అన్నట్టు మర్చిపోయాను,., ముఖ్యంగా చెప్పల్సిన సంగతి.. మా అట్లకాడ గురించి..
అది ఒక సారి చేయి జారి పక్కనే ఉన్న ఫ్రిడ్జి కింద పడింది. అంతటి ఫ్రిడ్జిని కదపటం నా వల్ల కాలేదు. మా మామగారిని సాయం అడిగాను భయం భయంగా.. అదొక మాయబజార్ పెను మాయ..! కదల్చటం ఎవరి తరం కాదు.
ఏంతో ఓర్పుగా నేర్పుగా ఇనప హ్యంగరు సాయంతో పాపం ఆయనే తీసి పెట్టారు.. అప్పటినించి గట్టుకి దానికి ఉన్న సందులో రోకలి బండ ఒకటి అడ్డుగా పెట్టాను.. మళ్ళీ ఆ ప్రమాదం జరగకుండా..

ఆ ఫ్రిడ్జి కింద సిధిలమైపోయిన ఒక ఎలక గారి కళేబరం ఒకటి తవ్వకాల్లో బయట పడింది..

అప్పుడెప్పుడో వచ్చిన ఆ కంపు వాసన ఇద్దన్నమాట అనుకున్నాం అందరం అది గుతొచ్చిన్నందుకు ముక్కున వేలేసుకొని ! ఇలాంటి వింతలు జరగటమూ మామూలే కదా..?

మా వాడని తోరణం (ఊలు తో అల్లినది- దానికి చిన్న చిన్న గంటలు కూడా వేళాడుతుంటాయి.) నా బెస్ట్ ఫ్రెండు మా పెళ్ళికి ప్రెజెంటేషన్ ఇచ్చింది. పండుగ నాడు మామిడి తోరణాలు కట్టుకున్నప్పుడల్లా దాన్ని భద్రంగా లోపల పెట్టేస్తాను.ఎండకి దాని కొన్ని రంగులు వెలిసినా.. మళ్ళీ అదే పెట్టేసుకుంటుంటాను..
మరి నేం ప్లేట్ సంగతో..? .. దాని వెనుక ఏడు తరాల సాలీడ్లు కాపురం ఉన్నాయి.. ప్రస్తుతం ఎనిమిదవ తరం నడుస్తోంది..
మా చంటిది మొన్న ఆదిగింది.. 'అమ్మ, ఇది శుభ్రం చేసి ఒక సారి మళ్ళీ పయింట్ వేయిస్తేనో? అని..అబ్బే.. ఆ సాలీడు పాపల ఆటా పాటకి అంతరాయమున్ను.. ఆ తల్లి తండ్రుల కలల చెదిరిపోవటమూ ఒకే సారి జరిగిపోతాయి.. అంచేత ఆ ఆలోచన విరమించుకుందామన్నాను... సాలోచనగా..ఆవులిస్తూ..😶

ఇవి పునాది రాళ్ళ కధ!

మొత్తానికి నా పునాది రాయి ఒకటి అలిగింది. దాని సంగతేంటో చూడాలి.. ఇవాళ్ళ! ఇన్స్టంట్ ప్రపంచంలో అన్ని యూస్ ఏండ్ థ్రో పాలసీ తో వస్తున్నాయి.. కానీ అంత తేలికగా చేతులెత్తేస్తామా? నో వే!

- సుష్మ విజయకృష్ణ


Monday, November 12, 2018

నాన్న మనసు!


నిన్న కళ్ళజోడు ఫ్రేములో స్క్రూ జారిపోయిందని సరిచేయించుకోవడానికి షాపుకెళ్ళాను https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f30/1.5/16/1f928.png🤨.
ఇంకో కస్టమరుకి కొత్త ఫ్రేములు చూపిస్తున్న షాపతను, కూచోండని సైగ చేశాడు.

సరే కదాని, ‘హెల్దీ లివింగ్’ అని ఉన్న ఒక పుస్తకం తిరగేయటం మొదలుపెట్టను. కవర్ పేజీ మీదనే పెద్ద పెద్ద కేకులు, ఫ్రూట్ కస్టర్డ్లూ ఇత్యాది అపరితమైన కొవ్వు పధార్ధాల రంగురంగుల బొమ్మలతో కనువిందు చేసే లా ఉందా పుస్తకం! https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f8d/1.5/16/1f914.png🤔

బరువు తగ్గటం ఎలా?’ అన్న శీర్షికకి అతికించిన ఫొటోలు అవి! ఇదొక వింత పబ్లిసిటీ! అన్నీ తినేయచ్చు.. కా...ఆ..నీ, ఎలా.. తినాలి..? ఎంత… తినాలి? అనేది మేము చెప్తాము !.. ఫ్రీ కన్సల్టేషన్! ముందు కొన్ని వారాలు ఉచితంగా.. తరవాత..నించి.. మిమ్మల్ని బిల్లులతో బాదుతాం... అని చీమ తలకాయ మీదున్న వెంట్రుకంత అక్షరాలతో రాశారు..ఎంచక్కగా ఎవ్వరికీ కనిపించకుండా..

"అవన్నీ నమ్మకండీ.. ఉత్త బోగస్! రెండు నెలలక్రితం ఇలాగే ఏదో పుస్తకం లో చూసి..తెగ ఆశగా వెళ్ళి బరువు మాట దేవుడెరుగు..,క్షవరకళ్యాణ వైభోగమే!", అని పక్కనించీ నేను చదువుతున్న పేజీకేసి చూపిస్తూ రొప్పుతోంది ఒక పక్కింటి పిన్నిగారు! https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/fea/1.5/16/1f625.png😥

ఆవిడకేసి ఒక ‘అవునా పాపం’https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/fa7/1.5/16/1f644.png🙄https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f89/1.5/16/1f910.png🤐 ఎక్ష్ప్రెస్షన్ విసిరి, మళ్ళీ పుస్తకంలో దూరిపోయాను నేను.

ఒక మోస్తరు సైజుఐ’ హస్పిటల్లో కింద ఒక పక్కగా ఉంటుంది ఈ కళ్ళద్దాల షాపు. కనుక డాక్టరు గారిని చూడ వచ్చే జనాలు, కళ్ళజోళ్ళ కొనుగోలు బాపతు జనాభా అంతా ఉన్నారు ఈ కామన్ సిట్టింగ్ ఏరియా లో.

ఒక తండ్రీ కోడుకులు ద్వయం వచ్చి నా పక్కనే ఉన్న సోఫాలో చతికిల బడ్డారు.
తండ్రి : “ఏరా..? కొని నెలైనా అవ్వలేదు, అప్పుడే సిమెంటు బస్తాలు మోసే వాళ్ళ చొక్కలా తయ్యరయ్యిందే?”, అని తండ్రి అడుగుతున్నాడు, పుత్రరత్నాన్ని (పు.ర)!

పు.ర. : ఒక ప్రశ్నార్ధ చూపు చూసి, ఇది ఇంతే..! అన్నట్టు తల మళ్ళీ దించేసుకున్నాడు ఫోన్లోకి!

తండ్రి : ‘ఆ ప్యాంటేమిట్రా? మోకాళ్ళ దగ్గర అలా చిరిగింది? చూసుకోలేదా?’ నలుగురిలో తిరిగే వాడివి, చదువుకునే పిల్లాడివి..మంచి గుడ్డలు కట్టుకోకపోతే ఎట్లాగురా? అన్నాడు మెల్లగా..
పు.ర. : మళ్ళీ అదే ఎక్ష్ప్రెషన్!
కనిపెట్టెశాన్నేను~ ..! మా బాబ్జీ గాడు చెప్పినట్టు ఒక ‘స్క్రీనేజర్’ వీడు!
మేనేజర్, వాయేజర్ .. పోనీ పేజర్.. లాగా ఇదేమి పేరు? https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/fa7/1.5/16/1f644.png🙄

భోజనానికి రమ్మనటానికి కూడ తల్లి నించి టెక్స్ట్ మెసేజ్ రాలేదని విస్సుకునే నేటి కుర్రకారు, వాళ్ళకు వాళ్ళే పెట్టుకున్న అతి ‘మొద్దు’ పేరు ఈ స్చ్రీనేజర్! https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f8/1.5/16/1f634.png😴

అంటే… అన్ని రకాల స్క్రీన్లకి (అనిన.. : ఫోన్లు, అయిప్యాడ్లు, కంప్యూటర్లు, చివరాఖరికి వీటినించి కాస్త ఊరటకి కొంచెం పెద్ద స్క్రీనైన టీవీ తో సహా!) అత్తుక్కుపోయేవారని అర్ధం!
వీళ్ళకి ‘సౌండ్ గండం’ ఉంది కాబోలు.. ఆట్టే మాట్లాడరు! ఉత్తుతినే అలా చూసి మళ్ళీ కలుగలోకి (అదే స్క్రీనులోకి) దూరిపోతారు అంతే! https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/fa/1.5/16/1f636.png😶

గాదిలోన పందిపప్పు, గాదికింద కందికొక్కు! .. టైటిలేంటి.. ఈ సొదేంటి?

ఆపు నీ డమ్మ డక్క డయ్యర..చించర పించర టించర గింజ!https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f85/1.5/16/1f631.png😱
మీలో ఉన్న మోగన్ బాబు ఇలా అనటం లో తప్పు లేది! చమించండి..

ఏదో రాయటాం మొదలుపెట్టి.. ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాను..
మా హిందీ టీచరు ఎప్పుడో చెప్పింది.. ఇలా రాస్తానని.. ఇలా మాత్రమే రాయగలననీ! నా తప్పేమీ లేదు.. నేను ఒక ‘టకట కవిని’ ! చెప్పదల్చుకున్న విషయం మరిచి, అవసరమైతే వదిలేసి.. ఇంకేదో చెప్పుకుంటూ పోయి.. చివరికి ఏమి చెప్పాలనుకున్నానో మర్చిపోతానన్నమాట!
ఇన్ని ఆలోచనల చిందర వందర గందరగోళంలో కూడా నా కళ్ళకి స్పష్టంగా కనిపించింది.. ఒక 'నాన్న మనసు’ !

ఇదిగో నేను వాళ్ళని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకండా తీసిన ఫొటో..
అదే బోలెడంత చెప్పేస్తోంది.. కావాలంటే మీరే చూడండీ…

Friday, November 9, 2018

శరదృతువు


'ఎచటినుండి వీచెనో చల్లని గాలి..' పాట వినిపించింది.
వనజ కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచింది. తను అయిపాడ్ కి జతపరచినఅలారం అది. మన మామూలుగా వినిపించే 'ట్రింగ్.....’కాకుండా, ఇలా పాటలు కూడా పెట్టుకోవచ్చు; అని తను తెలుసుకున్న రోజు మహా సంబరపడిపోయింది.  ఇంతక మునుపు, ‘ఎప్పుడు మోగుతుందా ?, ఎందుకైన మంచిది, శబ్దం వినపడి,  కలలు చెదరకముందే లేద్దాం అనే ఆలోచనతో, అసలు కలలే కనలేని అప్రమత్తంగా ఉండే రాత్రులకిక సెలవనుకుంది!
పైపెచ్చు హాయైన పాటలతో మేలుకొలుపు ఎవరికి రుచించదు? పద్ధతి కనిపేట్టినప్పటినించీ అన్నీ 'రసాలూరి (సాలురి రాజేశ్వర రావు గారి) ఉదయాలే! వనజ సాలూరి వారి పాటలంటె చెవి కోసుకుంటుంది మరి!
అప్పుడే అయిదైందా ?”, అనుకుంటూ నిద్ర లేచింది. కాలకృత్యాలు తీర్చుకొని, గబా గబా వంటింట్లోకి వెళ్ళింది, కుక్కర్ పెట్టడానికి! కిట్టు గాడి స్కూల్ బస్ పావుతక్కువ ఏడింటికి వచ్చేస్తుంది. వాడికిష్టమని ఇవ్వాళ  పులావ్ చేద్దామని పూనుకుంది. అందుకే తను యధావిధిగా వెళ్ళేమార్ణింగ్ వాక్ కూడా మానుకుంది. ‘పులావ్ అంటే మరి కొంచెం ముందొస్తు తయారీ కావాలి కదా? చక చకా పనిలో పడింది. తాలింపులోఖారాలు, మిరియాలు గట్రా వేస్తూ, మనసులోఅయ్యొ అన్నట్టు చిన్నది ..(తన గారల పట్టీ మేఘన) ఘాటు ఎక్కువైతే తినలేదు, పైగా వదిలెస్తుంది?”, అని గ్రహించిన 'అమ్మమనసు, చేతిలోంచి సగం మసాలా దినుసులే రాల్చింది మూకుడిలోకి !
అంతలోనే, తనలోని శ్రీమతి నిదురలేచింది.." ఆయనగారికి ఒక రెండు మిరపకాయలు వెయించి చివరన సద్దేస్తే సరి!” అనుకుంది చిలిపిగా, శ్రీవారిని తల్చుకుంటూ! నారీమణులకి మల్టీటాస్కింగే కాదు మల్టీథింకింగు కూడా వచ్చును సుమండీ. అందులో మన వనజ దిట్ట!
లంచ్ బాక్సులన్నీ గబ గబా సద్దేసి, కాఫీ కి డికాషన్ వేసి, కిట్టూ గాడిని నిద్ర లేపడానికి వెళ్ళింది. వాడు అటు నీలిగి, ఇటు నీలిగి, తిన్నదేదో తిని, హడావుడి పెట్టి, చివరికి పాలు తాగకుండానే తుర్రుమన్నాడు! "అబ్బా, వీడిని రేపటినించి ఒక పది నిముషాలు ముందు లేపాలి " అని పళ్ళు నూరుకుంది వనజ.
కాని తల్లి గుండే సీతయ్యJ ! అది తన మాట వినదు. అది ఎప్పుడూ ఇంకోలా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. మరునాడు యధావిధిగా జాలి నిండిన తల్లి గుండె, ‘పోనిలే కాసెపు పడుకోనీ అనుకుని ప్రయత్నం మానుకుంటుందని తనకి తెలుసు ! అదే లాలి పాట ఆలాపనలో గమత్తు!
ఒక విరక్తి నవ్వొకటి లీలగా నవ్వుకొని, ఒక కప్పు కాఫీ కలుపుకొని, రాత్రి మిగిలిన చపాతీ ముక్కకి కాస్త మిరపళ్ళ కారం పూసి, టీవీ ముందు కూర్చుంది వనజ.  టీవీ ఫైవ్ లో 'ఫేవరెట్ ఫైవ్అనే కార్యక్రమంలో రోజు వంతు ' స్వర రాజేశ్వరుడిది. ఆయన  మీదనే ప్రోగ్రాము. “ఆహా, ఇదియే కదా భాగ్యమనిన”, .. అనుకొని, ఇంకొన్ని పాటలు విని--చూసేసింది హాయిగా!
 కారం- తీపి-చేదు అన్ని రకాలుగా (అంటే.. కాఫీ-పచ్చడి- చపాతీ కాంబినేషన్ తో జిహ్వకి; హేమాహేముల వంటి నటుల అభినయం - అద్వితీయమైన సంగీతం కాంబినేషన్ తో మనసుకీ..) అస్వాదించేసింది కాసేపట్లో! ఇంతకంటే అహ్లాదకరమైన ఉదయం ఉంటుందా? అనుకుంది. “ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. వాటిని ఆస్వాదించడం చేతనవ్వాలి అంతే. ఉదయాన్నే మనసు హాయిగా ఉంటే, రొజంతా ఎంతో ప్రశంతంగా గడిచిపోగలదు. కాలజ్ఞానసార ప్రకారం ఇవి మనోల్లాసినికి అవసరమని అనిపించటం మానేశాయి మనుషులకి ! అదే విచిత్రం!”, అనుకుంది వనజ.
చిన్న సైజు ఆత్మ  త్రుప్తితో లేచి, మేఘనను లేపి స్కూల్ కి తయారుచేయడానికి పూనుకుంది. నీళ్ళు పోసి, జెడలు వేసి, ఆన్నం పెట్టి, బస్ ఎక్కించి కార్యక్రమం కూడా అయ్యిందనిపించింది. సాకేత్ ఆఫీస్ కి తయారయ్యి బయల్దేరుతూ, "ఏమిటొయ్, ఇవ్వాళప్రత్యేకం? పులావ్ చేసినట్టున్నవ్?”,  అంటూ కళ్ళెగరేశాడు. “మీ పుత్ర రత్నం నిన్న పరీక్షలో మాంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు కదా? అదీ విశేషం. ఇష్టంగా తింటాడని చేశానండీ. చాలా కష్టపడ్డాడు కదా మరి”,అని జవాబు ఇచ్చింది.  అలాగైతే వాడికిష్టమైన గులాబ్ జామున్ కూడా చేసేయి పనిలో పని, స్వామి కార్యం స్వకార్యం రెండూనూ ..! అని నాలిక కరుచుకున్నాడు, వనజ స్పందన కోసం ఓరగా చూస్తూ”. “నిజం ఒప్పుకున్నందుకు తప్పకుండా చేస్తాను”, అని ముసి ముసి నవ్వులు నవ్వుకుంది వనజ.
సాకేత్ ఆఫీసుకి వెళ్ళాక, తను స్నానం చేసి, దేవుడి దగ్గర దీపం పెట్టి, కాలేజీకి బయల్దేరింది.
బయట శరద్రుతు శోభలుఅంతని, ఇంతని చెప్పనలవికాకున్నాయి. చెట్లన్నీ పట్టుచీరలు కట్టిన పండు ముత్తైదువుల్లా కళకళలాడుతున్నాయి. పొగమంచులు వీడని రోడ్లు, రాలిన ఆకులతో ఆహ్లాదంగా స్వాగతం పలికాయి. అందునా, కార్తీక మాసం కావటం తో ఒకలాంటి దైవికమైన వాతావరణంగా ఉంది ఊరంతా.
బండి నడుపుతూ చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తోంది వనజ. పదేళ్ళుగా తను చూస్తున్న దారే! కానీ బయటికి వస్తే కాని, కనిపించని శరద్రుతు శోభలను చూసి ముగ్ధురాలయ్యింది. “పని హడావుడిలో పడి ఇవన్నీ ఎంత మిస్సయిపోతున్నానొ, ప్చ!”, అని నిట్టూర్చింది. 
వనజ మధ్యనే తన కొత్త ఉద్యోగంలో చేరింది. పొద్దున్నే ఎనిమిది గంటలకి వెళ్ళి సాయంకాలం నాలుగింటికి పిల్లలు ఇంటికి చేరేవేళకి వచ్చేస్తుంది. ఇంతకు మునుపు ఒక పార్టయిం ఉద్యోగం చేసేది. అదీ పిల్లలింకా చిన్నవాళ్ళని, వాళ్ళతో ఎక్కువ సమయం గడిపేది. అవసరం కూడా! ఉద్యోగం కేవలం ఒక వ్యాపకం. చదివిన చదువుకి ఒక సార్ధకత అనుకుంది అప్పట్లో. ప్రస్తుతం పిల్లల్దు పెద్దవాళ్ళై కొంత బిజీ అయ్యారు. మధ్య తరగతి ఆర్ధిక కష్టాలు చెప్పనేల?  అని అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటూ ఫుల్టయిం ఉద్యోగం లో చేరింది. ఒకప్పుడు తన జీతం వేణ్ణీళ్ళకి చణ్ణీళ్ళలా తోడు. కానీ ఇప్పుడు ఎదుగుతున్న పిల్లల పై చదువులకి అవసరమైన రాబడి.
అందుకని కొంత కాలం క్రితం వరకూ ఇంత పని వత్తిడి లేదు. పొద్దున్నే పిల్లలని స్కూళ్ళకి పంపేసి చుట్టుపక్కన ఉన్న సమవయస్కులైన అమ్మలందరూ బాతాఖానీ వేసుకునేవారు. సరదాగా అలా మార్ణింగ్ వాక్ కి వెళ్ళేవారు ఒక నాలుగు కిలోమీటర్లు. వస్తూ సరుకు సామాగ్రీ కొని, ఎవరి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయే వాళ్ళు. సాయంత్రాలు కూడా సరదాగా గడిచిపోయేవి. పిల్లలతో, వాళ్ళ పనులతో ఎప్పుడూ ఎదో ఒక హడవుడి పండగలా ఉండేది. అమ్మలక్కలతో ముచ్చట్లు, పిల్లల ఆటలు, సామూహిక భోజనాలు ఇలా ఎన్నో సందడి రోజులు.
సరదా రోజులు గుర్తొచ్చాయి తనకి దారి వెంటవెడుతుంటే! అప్రయత్నంగా కళ్ళవెంట నీళ్ళు కూడా తిరిగాయి. పిల్లలు పెద్దవాళ్ళయి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. అందరు ఏంటో తెలియని ఒక వింత పరుగు పందెంలో భాగస్వాములైపోయారు ఒక్కసారిగా! ఎన్నో ఆలోచనా తరంగాలు తనని చుట్టుముట్టాయి. తీయని జ్ఞాపకాలే వాటికి పునాది! “అగాధమౌ జలనిధి లోనే ఆణిముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే.." అని కార్ స్టీరియో లో పాట తోడవటం తో ఒక్క క్షణం అంతర్ముఖురాలయ్యింది వనజ .
జీవితం ఎన్ని మలుపులు తిప్పుతుందో కదా ? పరిస్థితుల బట్టీ, అవసరాలను బట్టి ఏర్పడేవే, వ్యాపకాలు!, కొత్త దారులు! అందులో భాగంగా చిరు త్యాగాలు. ఎప్పుడూ జీవితం ఒకేలా ఉండాలి అనుకోవటం అవివేకం! తన విషయానికొస్తే పార్టయిం ఉద్యోగం చెసినప్పుడేమో నా చదువుకి తగ్గ పారితోషకం అందట్లేదనో, లేక ఇంతకంటే గౌరవం గా, చదువుకి తగ్గ హోదాలో ,అందరూ తనని గుర్తించేలా, బతకలిగితే బావుణ్ణు అనుకున్న క్షణాలూ లేకపోలేదు! కాని, చదువుకుని ఇంటికి పరిమితమైపోయిన ఎందరో తల్లుల్లా , పిల్లలే ప్రపంచమనుకుంది కొన్నాళ్ళు.
స్వతహాగా ఖాళీ గా కూర్చునే తత్వం కాకపోవటం తో ఏదో ఒక ఉపయోగ పడే పని, తన వల్ల నలుగురికీ ఉపయోగపడె పని చేసింది పార్టయిం జబ్ గా. పక్కనే ఉన్న కాలేజీ గ్రంధాలయం లో పర్యవేక్షణా విభాగంలో ఒక చిరు ఉద్యోగిగా సేవలందించింది. తను బిజినెస్ ఎడ్మినిస్తేషన్ లో దిస్టింక్షన్ లో పాస్ అయినా మాత్రం చిన్నతం అనుకోలేదు.
మధ్య అనుకోకుండా వచ్చిన  ఒక సదావకాశాన్ని, దేవుడిచ్చిన అదృష్టం గా భావించి మరోసారి కాలదన్నుకోలేక తన చదువు కు తగ్గ ఒక ఉన్నతాధికర వృత్తి చేపట్టింది. దారిలో నడవటానికి కొన్ని చిరు త్యాగాలు చేయకతప్పలేదు మరి.  తను కోరుకున్న జెవితమే కదా ఇది. ఆలోచించి వేసిన ఆడుగులే కదా ఇవి. మరి ఏదో కోల్పుతున్నట్టు ఎందుకీ ఆవేదన? అవ్వా బువ్వా రెండూ  కావాలంటే ఎలా? సున్నితంగా  నిట్టూర్చింది వనజ. మళ్ళీ నా దన్న శరద్రుతువు ఎప్పుడో? అనుకుంటూ కార్యోన్ముఖురాలై ముందుకు సాగింది.
రుతుక్రమమనేది ఎంత సహజమో జీవితంలో ఆనందం దుఖం అనేవి కూడా అంతే సహజం. అవి చుట్టపు చూపుగా వచ్చిపోతుంటాయి.
వనజ లాంటి ఎందరో మాతృమూర్తులు రాబోయే శరదృతువు కోసం ఆనందంగా గ్రీష్మ వర్ష రుతువులను ఎదురుకుంటారు. వారికి నమస్సుమాంజలి.