Monday, June 18, 2007

నాట్యం



కంఠేనాలంబయేత్ గీతం
హస్తేన అర్ధం ప్రదర్శయేత్
చక్ష్యుభ్యాం దర్శయేత్ భావం
పాదాభ్యాం తాళం ఆచరేత్

లలిత కళలన్నింటిలోనూ, మనసును రంజింపజేసేది నాట్యం! అందుకే ఒక కవి అన్నాడు..
అంగభంగిమలు గంగ పొంగులై
హావ భావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల!
రస ఝరులు జాలువారేలా!! అని..

అటు వంటి నాట్యాన్ని తమ నర నరాల్లొ జీర్ణింప జేసుకొని , తమ ఉనికి లో నింపుకొని అశేష ప్రజానీకాన్ని అలరించిన నర్తకీమణులు ఎందరో. నటిగా మనకు పరిచయమైనా, నర్తకిగా అందరి మనసుల్లొ చెరగని ముద్ర వేసుకున్న వారు భనుప్రియ. నాట్యానికే వన్నె తెచ్చారు ఆవిడ. స్వర్ణకమలం చిత్రం లో చివర్లో వచ్చే పాట ఎవరు మరువగలరు? నాట్యానికి చక్కని అభినయం తో పాటు, వేగన్ని జోడించి, పర్వత శిఖరాలు నుంచి జాలువారే జల ప్రవాహం లా అనిపిస్తారు. శివుని శిరస్సునుండి భువి కి దిగిన గంగ ను మరపింపజేసారు! శ్రి గోపీ కృష్ణ గారి నృత్య దర్శకత్వం లో , ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మనకు మిగిల్చారు. అయన దర్సకత్వం వచ్చిన ఇంకొక మరపురాని నాట్య రూపకం, సాగర సంగమం చిత్రంలోని కమల్ హాసన్ గారు నర్తించిన గీతం. ఏమి లయ, ఏమి తాళం? వర్ణింపనలవి కాదే!
ఎందరో నూతన నటీ నటుల పరిచయ కార్యక్రమలలో వింటున్నాం, వారి వారి dream role, కని character కాని ఎమిటంటే, సాగరసంగమం లో కమల్ హాసన్ నాట్య ప్రదర్శన, లేక స్వర్ణకమలం లో భానుప్రియ గారి నాట్యం అని. అశేష ఆంద్రులలో అంతగ impact చుపాయి ఆ చిత్రాలు. గోపి కృష్ణ గారి నాట్యం భూకైలాస్ లో మనకు కనిపిస్తుంది. కాలికి కట్టిన మువ్వలన్నిటి లో ఒకటి మాత్రమే కదిలేలా నర్తించటం ఆయన ప్రత్యెకత!
గదిచిన కాలం నాటి నర్తకిమణులలో ఎల్. విజయలక్ష్మి గారు ప్రశంసనీయులు. ఆవిడ కూడా వెగనికి మారు పేరు. దేవుదిచ్చిన అంగసౌష్ట్యం వీరందరికి గొప్ప వరం. నర్తనశాల , బొబ్బిలి యుద్ధం , వంతి చిత్రాలలో వీరు ప్రదర్శించిన కళ అచరామరం.
ఇటువంటి కళను మనం ఆస్వాదించటం మన అదృష్టం.