Saturday, February 23, 2008

'cellular' ప్రపంచం!!



shop లో సరుకులు కొని, ఇంటి వైపు నడక మొదలుపెట్టాను. ఎదురుకుండ, కొంచెం దూరంలో ఒక మనిషి గాలిలో చేతులు ఊపుకుంటూ వస్తున్నాడు. తల కూడా అడ్డంగా ఊపుతున్నాడు. ఏదో మాట్లాడుతున్నట్టు కనిపిస్తూనే ఉంది. పక్కన ఎవరూ లేరు, మరితను తనలో తనే మాట్లాడుకుంటున్నాడా? కొంచెం తేడా గా అనిపించేసరికి, ఎందుకైనా మంచిదని, నడక speedu పెంచి, ఒక మాదిరి పరుగు లంఘించుకొని చక చకా అడుగులు వేశాను. తొందరగా ఇల్లు చేరితే బావుండనిపించింది.

కొంచెం దూరం తగ్గేసరికి మాటలు వినపడ్డాయి, ఎవరినో తిడుతున్నాదు. "ఆ project మనకి రాలేదనుకో, మీ అందరి ఉద్యోగాలు out! చెప్పిన ఏ ఒక్క పని సరిగ్గా చేయ్యలెరయ్యా మీరు, కానీ పెద్ద పోటుగాళ్ళా లాగా cutting ఒకటి కొడతారు". మాటలు వింటుంటే మమూలు మనిషిలానే మాట్లాడుతున్నడు! మరి ఇదేమి జాఢ్యం రా దేవుడా అనుకొని, ఓరగా చూశాను, అప్పుడు కనిపించింది, చెవికి వేళ్ళాడుతున్న ఒక 'bluetooth' . ఎప్పుడో నా చిన్నప్పుడు చూసిన గుర్తు, లంబాడీ ఆడవాళ్ళు, పెద్ద పెద్ద రంగు రంగుల ఝుంకీలు, కమ్మలు చెవులకి ధరించే వారు . ఇది అలాగే ఉంది, కానీ కొంచెం posh గా, fresh గా !

ఇంతలో 'ధాం' అని పెద్ద శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూదును కదా, ఇందాక హడావుడిగ ఎవరినో తెగ తిడుతూ వెళ్ళిన మనిషి road మీద పడి కనిపించాడు. అప్పుడు గుర్తొచ్చింది, ఇందాక నెను నడుస్తున్న దారిలో కొత్త man hole cover కి గుర్తు గా ఒక బండ రాయి ని కాపలా పెట్టారు. ఈ ప్రబుద్ధుడు ఆ మాటల గోలలో దానిని చూసుకోకుండా వెళ్ళి , అది తగిలి కింద పడ్డాడు. తలకి చిన్న దెబ్బ కూడా తగిలింది.

ఇలాంటి scenes మనం రోజు చూస్తూనే ఉంటాం. in fact we might have experienced it ourselves. చూసుకోకుండా road cross చేసిన సందర్భాలలో car drivers దగ్గరనించి చివాట్లు, గట్రా..ఇదీ వరస!

ఒకప్పుడు road మీద ఎవరైనా తమలో తామే మాట్లాడుకుంటూ ఎదురుపడితే doubt లేకుండా 'పిచ్చివాడని ' stamp పడేది! జాలి పడే వారు, దారి తప్పుకొని పక్కనించి వెళ్ళేవారు. కానీ ఈ మధ్య ఈ 'one side traffic' లు ఎక్కువైపొయాయి. 'cellular world ' కి స్వాగతం!! చెవులకి, చేతులకి తీరిక ఉండటం లేదంటే నమ్మండి. road ల మీద వచ్చేపోయే వాహనాల్ని గమనించరు! మన వెనక ఎవడైనా ఏ దురుద్దేశంతొనైనా వెంట బడుతున్నాడా అన్నది పట్టించుకోరు! సినిమాలలో comedy చేయటానికి comedians man hole లో పడటం నవ్వు తెప్పిస్తుంది. కని అదే మనకి జరిగితే అది కొన్ని కొన్ని సార్లు ప్రాణం మీదికి తేవచ్చు. ఎవడి లోకం వాడిది. ఎమన్నా అంటే privacy అంటారు. cell ని కనిపెట్టిన ఉద్దేశ్యం కంటే , దాని వలన చెడే ఎక్కువ నమోదు అవుతోంది. class room లో, office లో, restaurent లో, bus లో, auto లో, road మీద, car లో , driving లో, బండి నడిపే వాడు మాట్లాడుతూ ఉంటాడు, వెనక కూర్చున్న వాడు మాట్లాడుతూ ఉంటాడు, road దాటే వాడు మాట్లాడుతూ ఉంటాడు, ఇంక accidents అవ్వక ఎమవుతాయి?

ఇది ఎంత చిరాకైపోయిందంటే, class room లో పాఠాలు చెప్తున్నప్పుడు కూడా silent mode లొ cell మొగుతూనే ఉంటుంది. చదువుకునే పిల్లలకి కనీసం college time లో ఐనా చదువుకన్నా ముఖ్యమైనది ఎముంటుంది? ఆ కసేపు కూడా ఆగలేని urgency ఏమిటో అర్ధం కాదు. ఈ technology మంచికే వచ్చిందో , చెడుకే వచ్చిందో అర్ధంకాకుండా ఉన్నది. ఎవరికి ఏ పని మీద శ్రద్ధ ఉండదు. మనసు చేసే పని మీద నిమగ్నమవ్వదు. ఎక్కడో మాట్లాడుతూ, ఏదో ఆలోచిస్తూ చేసే పని ఎంతవరకు successful అవుతుందో తెలిసిందే.

ఇది ఒక్కరి సమస్య కాదు. అందరి సమస్య. ఎవరికో ఉపకారం చేయట్లేదు. తమరి క్షేమం కోసమే కొంచెం జాగ్రత్త వహిస్తే అందరికి క్షేమం.