ఏ దారమో పపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం.. అన్నారు సిరివెన్నెల ఒక పాటలో..
ఎంత గూడార్ధం దాగుందో అనుకున్నాను ఆ పాట విన్నప్పుడు.
అప్పుడే పుట్టిన పసికందు ని చూశాను మొన్న. ముడతలు పడిన చర్మం, బలం లేని వేళ్ళు, నిలపలేని మెడ..సృష్టి విచిత్రానికి ప్రత్యక్ష సాక్ష్యం గా ఉంది ఆ చిట్టి రూపం.
అప్పుడే పుట్టిన పాపాయి చేతికి స్పర్శ తెలియదు. తన వేళ్ళూ ఉన్నాయన్న విషయమే తనకి తెలియదు. కాలక్రమేణా ఆ చిట్టి చేతుల ఉపయోగం, వాటి ఉనికి తెలిసి వస్తుంది. బలం కలిగే కొలది, వాటి పట్టు పెరుగుతుంది.
అలాగే వాళ్ళు పుట్టిన వెంటనే ఎవరిని కళ్ళతో గుర్తించలేరు. స్పందించలేరు. కాని వినగలరు, చూడగలరు.
ఐనా అంతా మనకి ముద్దుగా, ఎంతో కనువిందుగా ఉంటుంది. ఎంత చిన్న చిన్న చేతులో, ఎంత చిన్న కాళ్ళో అంటూ తెగ ముద్దు చేస్తాం. ముచ్చట పడతాం.
మొత్తం కాకపోయిన, ఇంచు మించు ఇదే శరీర స్థిథి మనిషి జీవిత కాలం లో ఇంకోక సారి వస్తుంది. వార్ధక్యం లో.
కాని అప్పుడు ఏదీ ముద్దుగా , ముచ్చటగా అనిపించదు. వాంగి పోయిన అవయవాలు, పట్టు లేని చేతులు, వాలిపోతున్న తల..మొదలు ఎలాగో, చివర అలాగే..
ఎమి రాని, చేతకాని పసి బిడ్డకు సర్వం తానే అయ్యి చూశే తల్లి, తిరిగి తన వృధ్యాపం లో ఆ బిడ్డకు భారమయి పోతోంది.. ఇది మనిషి సృష్టించిన చిత్రం. సృష్టి విచిత్రం ముందు మనిషి సృష్టించిన చిత్రం బలం గా లేదు?
నీ చేతులకు సత్తువ లేనప్పుడు నా చేతులే నీ చేతులుగా చేసి నీకు అన్ని చేశాను, నీ కు నడక రానప్పుడు నా చేతులు అందించి నీన్ను నడిపించాను, నువ్వు కింద పడిపోతే నేను కంట నీరు పెట్టాను, మరి నా చేతుల లో సత్తువ లేనప్పుడు, నువ్వు నాకు నీ చేయి అందించాలి కదా?
చిట్టి రూపాన్ని చూసినప్పుడు ముచట వేయటానికి కారణం ఏమిటి? ముసలి రూపాని చూసినపుడు కలగపోవటానికి కారణం ఏమిటి?
రెండు శరీరాలే కదా?
కొన్ని కారణలు ఉన్నాయి.
పసితనం నిషకల్మషమైనది. వారి ఆలోచనలు, ఆశలు, అభిరుచులు, కనీసం వారి ఊహ కూడా మనకి తెలియదు. అది దైవత్వం. ఎమి రాయని కాయితం.
కాని వృధ్యాప్యం అలా కాదు. కనీసం మనం అలా అనుకోము. అవయవాలలో బలం లేకపోయినా, ఏమీ ఆలోచించే స్థితిలో వారు లేకపోయినా, వారి జేవితం కాలం అనుభవాలు, లోటు పాట్లు, ఇష్టాయిష్తాలు, రాగ ద్వేషాలు మనకు తెలియటమే..
నిజంగా అవసరమొచ్చినా, వారికి సహాయ పడటానికి ఆలోచిస్తాం, పూర్వపు అనుభవాలను మర్చిపోము. ఆ సందర్భం లో అలా అన్నారని, లేక మన మాటతో ఏకీభవించలేదని..గుర్తు తెచ్చుకొని మరీ కారణాల పరదాలను అడ్డు కట్టేస్తాం.
కాని సృష్టి తీరు ని గౌరవించాలి. పుట్టినపుడు ఎలా ఉందొ, పోయేటప్పుదు శరీర స్థితి అలాగే ఉంటుంది కాబట్టి, ఏ అరమరికలు లేకుండా, వీళ్ళని వాళ్ళలాగే స్వీకరించగలిగితే ఆ రెండు దశలలో లేని మనం దైవత్వాన్ని పొందినట్టే!
Photo courtesy http://www.photographybylaurel.com/