'గ్రహణం'
పేరు విని ఏదో దయ్యాల సినిమా అనుకున్నాను. కాని , కాదు ! చలం గారి రచన. ఆహా ఎన్నాళ్ళాకి మన దర్శకులకి కళ్ళు తెరుచుకున్నాయో? routine గా మనం వినే dialogue కదా, "అసలు touch చేయని point" , "ఎవరూ తీయని subject" అని. ఏ దర్శకుడి interview చూసిన ఈ వాక్యం లేకుండ interview పూర్తి చేయరు! ఝాన్సి ఈ point ,'talk of the town' లో touch చేసిందో లేదో గుర్తు లేదు నాకు, కాని తప్పకుండా ప్రయత్నించాలి. ఒకరు ఒక కొత్త subject మొదలు పెదితే, ఇంక అందరూ అదే పట్టుకొని పాకులాడతారు. కొత్తదనంలో variety కరువైపోయి0ది. పోని వీళ్ళ బుర్రలకి ఏమీ తట్టక పోతే , మహానుభావుల రచనలైన తీయచ్చు గా అనుకునేదాన్ని! ఇప్పటికి సాధ్య పడింది.
మొన్నా మధ్య దూరదర్శన్ లో కాంతం కధలు కూడా తెరకెక్కించారు. ప్రాణానికి ఎంతో హాయిగ అనిపించింది. నటీనటులకు తమ అసలు ప్రతిభ కనబరిచే అవకాసం ఇచ్చినట్టైంది. ఈ 'గ్రహణం' సినిమా చూసినా అలాగే అనిపించింది.
మొదటి సారిగా 'జయలలితా గారిని శృతిలయలు సినిమా లో చూశాను. చక్కని చాయ, పొడవాటి సిరోజాలు, మంచి ఉచ్చారణ, స్త్రీత్వం మూర్తీభవించినట్టు ఉందీవిడ అనుకున్నాను. కాని మన దురదృష్టం, ప్రతిభను సరిగ్గా వాడుకోవటం కూడా చేతకాని దరశకులని మనవాళ్ళానే అనుకోవాలి. ఆవిడ నటించిన సినిమాలన్నిట్లో ఆవిడకి అశ్లీలత, అసభ్యత అప్పజెప్పారు. ఇన్నాల్టికి ఒక మంచి పాత్ర లో కనిపించారు. నిండుగా ఉన్నారు.
తనికెళ్ళా భరణి గారు చాలా సహజంగా నటిస్తారు. ఆయన కూడా తన పాత్ర కి పూర్తి న్యాయం చేకూర్చారు. మిగతా నటీనటులు కూడా చాలా చక్కగా అభినయించారు. మొత్తానికి సినిమా చాలా బావుంది. అతి సులువైన తెలుగు కూడా పలుకలేని వేరే భాషల heroines ని చూస్తే, ఏదో dubbing సినిమా చూస్తున్న భావన కలుగుతున్నది. ఎంతో మంది ప్రతిభావంతులు మన గడ్డ మీదే ఉన్నారు. వాళ్ళని వెలికి తీయల్సిన బధ్యత మన దర్శకులది.
ఇప్పుడు next duty ప్రేక్షకులుగా మనది..
factionist సినిమాలని, అశ్లీలత ను ఎలా స్వీకరిస్తున్నామో , అలాగే ఇలాంటి మంచి సినిమాలని కూడా ఆదరించటం నేర్చుకుందాం. కనీసం అలాగైనా ఇలాంటి సినిమాలకి ప్రోత్సాహం లభిస్తుంది. మంచి నటన చూసే అవకాసం కూడ ఉంటుంది.
హింది art cinema దేశమంతా చూస్తారు. జాతీయ అవార్డులు కూడా ఇస్తారు. oscars కి nominate చేస్తారు. మరి మన తెలుగు సినిమాలకి ఆ శుభఘడియలెప్పుడు? 'ఆ నలుగురూ', 'అనుకోకుండా ఒక రోజు' ఇలాంటి విలక్షణమైన కధలకి గుర్తింపు రావాలి. ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.
జై తెలుగు సినిమా!
11 comments:
grahanam bagundi.evarina 'vanaja' choosara.a film gurinchi kooda raste baguntundi
GRAHANAM NENU COODALEDU. MEERU RAASINA DAANNI BATTI COOSTE COODAALANE UNDI
mana telugu sahithayam yentho goppadi.
kani directers ki real ga grahanam pattindi.
జయలలితగారి గురించి నాకూ ఇదే అభిప్రాయం. తెలుగును ఆవిడ మాట్లాడగలిగినంతబాగా మాట్లాడటం చాలామంది తెలుగువారికి చేతకాదు. ఆమెది చాలా సహజమైన నటన. ఆవిడ వేసిన/వేయవలసివచ్చిన అశ్లీల వేషాల వలన జయలలిత"గారు" అనటానికికూడా సందేహించే పరిస్థితి కలిగింది. ఎంత ప్రతిభ ఉండి ఏం లాభం.
మంచి సినిమా అని అందరూ చెబుతున్నారు. చూడాలి చూడాలి అనుకుంటూనే గడిపేస్తున్నా...
తనికెళ్ళ భరిణి గారు అండర్ యూజ్డ్ ఆక్టర్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు.
movie chalaa heavygaa vundi andi...mee review haayigaa vundi...
మంచి టాపిక్ లేవదీశారండీ.
జయలలిత గారి గురించి మీ అందరి అభిప్రాయాలతో ఏకీభవించలేకపోతున్నా - చలం కథ నాకు అర్ధమైనంతలో ఆవిడ పాత్ర అందమైనదే కానీ, ఒక లక్ష్మీ దేవి లాంటి అందం, అందరికీ గౌరవ భావంతో మొక్కాలనిపించే అందం ఆవిడది. జయలలిత గార్ని చూస్తే .. ఆవిడ మంచి నటే .. బానే చేశారు కూడా .. కానీ ఆవిడలో ఏదో ఒక విలాసం ఉంది .. ఆవిడ సత్యభామగా నప్పుతుంది, రుక్మిణిగా కాదు - అనిపించింది. సినిమాకి హైలైట్ తనికెళ్ళ నటన.
అదంతా సరేగానీ వసంతకోకిల గారూ, ఇలా ఇంకాసిని మంచి సినిమాల గురించి చర లేవదియ్యండి.
వసంత కోకిల గారు,
కొత్త పాళీ, రానారె గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. 'గ్రహణం' లో జయలలిత పోషించిన పాత్ర ను వేరే ఎవరైనా (సౌందర్య అయితె ఇంకా బావుండేది) పోషించి ఉంటే, ఆ పాత్ర పడిన బాధ మన మనసులో కూడా గుచ్చి ఉండేది. అయితే, జయలలిత ను ఎన్నుకుని, 'అది' జరిగిందేమో అన్న 'సస్పెన్స్' లాంటిది ఏర్పరచడానికి దర్శకుడు ప్రయత్నం చేసాడనుకుంటాను
మరో మంచి సినిమా 'రాగం'. కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ నిర్మించి నటించిన Morning Raga అనే ఆంగ్ల చిత్రానికి తెలుగు అనువాదమిది. పేరుకి అనువాదమే కానీ తెలుగులోనే తీసిన చిత్రంలాగుంది. చాలా చిన్న కధని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. డెబ్భై ఐదు నిమిషాలే ఉంటుందనుకుంటా. ఉన్న రెండు పాటలూ దేనికదే గొప్పవి. క్లైమాక్స్ పాటలో షబానా ఆజ్మీ అభినయం చూసి తీరాల్సిందే. అంత కఠినమైన స్వరాలతో కూడిన కర్ణాటక శాస్త్రీయ సంగీత గీతానికి భాష సంగీతమ్మీద పట్టులేకుండానే ఆమె అంత గొప్పగా లిప్ సింక్ చేసిందంటే నమ్మటం కష్టం.
జయలలిత గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి,ఆమె మాకు ఒకట్రెండుమూడేళ్ళు సీనియర్ అనుకుంటా,కాకపోతే కాలేజీలు వేరు,గుంటూరు బండ్లమూడి హనుమాయమ్మ కాలేజీలో అమె,ఏసీకాలేజీలో నేను(అలాగే మా పక్కనే ఉన్న ఉమెన్స్ కాలేజిలో సినీనటి సుమలత కూడా మాకు సీనియర్).కానీ మా మిత్రులు చాలామంది చెప్తుండేవారు ఆమె అందం,నాట్యకౌశల్యం గురించి.ఆత్రం ఆగని కొందరు బి హెచ్ సి దాకా వెళ్ళి చూసొచ్చేవారుకూడా.ఆవయసులో అందమైన అమ్మాయిలని చూట్టానికి నాలుగు కిలో మీటర్లు పెద్ద దూరం కాకపొయినా ఎందుకనో బద్దకించాను.తర్వాత ఇంద్రుడు-చంద్రుడు సినిమా చూస్తుంటే నా క్లాస్మేట్ ఒకడు(డిగ్ర్రీలో వెధవలే నాకు యూనివర్శిటీలో కూడా చాలా మంది సహాధ్యాయులు లెండి) ఒరె ఇప్పటికన్నా గుర్తొచ్చిందా,బ్రాడీపేట,బి హెచ్ సి,బ్రాహ్మలమ్మాయి ఆ అమ్మాయేరా అని గుర్తు చేసాడు.శాస్త్రీయనృత్యంలో ఎంతో అభినివేశం ఉన్న జయలలిత సినిమాల్లో గుర్తింపైతే పొందింది కానీ,తన ప్రతిభకు తగ్గ పాత్రలు పొందలేకపోయింది అనిపిస్తుంటుంది నాకెప్పుడూ.
abbo boledanni kotta vishayalu charchaku vachayi.. andariki chala thanks
Post a Comment