Sunday, January 10, 2010

ఎక్కడికీ ఈ పయనం?

"చాల్లెంజ్" .. మా టీవీ లో ఈ కార్యక్రమం ఎవరైనా చూశారా? పోనీ కనీసం దాని ట్రయిలర్ అయినా చూశారా?
చూసి ఉండకపోతే మీకో చిన్న స్యాంపల్ ఇదిగో..

" నా కాళ్ళకి వంగి దండం పెట్టినా నీ రుణం తీరదు" , "చాలమ్మ, నీకంత సీను లేదు!", ఒక న్యాయ నిర్ణేతా స్థానం లో ఉన్న వ్యక్తి కళాకారుడితో అనే మాటలివి.
అదొక్కటే కాదు. ఇంక భాష లో, భావం లో, అవధులు దాటిన అసభ్యత యేరులై పారుతుంది ఆ కార్యక్రమంలో.
కల్మషం, పైశాచికత్వం, కట్టలు తెంచుకున్న క్రౌర్యం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బ్లాగు అంతా సరిపేమొ..లేక నాకు తెలిసిన తెలుగు పదాలు సరిపోవేమొ..ఇవి నేడు మనకు టీవీ కార్యక్రమాలలో దర్శనమిస్తున్న తంతు.

ఒక పక్క ఆ అయిడియా సూపర్ సింగర్ కార్యక్రమం. అదొక చెత్త లా తయారయ్యింది. అందులో అయితే మరీ దారుణం. న్యాయ నిర్ణెతలే ఒకళ్ళతో ఒకళ్ళు అగౌరవంగా మాత్లాడుకోవటం, నేరాలు ఎంచుకోవటం, వారి వారి అహాలను అందరి ముందు సంతృప్తి పరచుకోవటానికి విచక్షణా రహితంగా నోతికొచ్చినట్టు మాత్లాడుకోవటం.. పరమ చిరాకుగా తయారయ్యింది వ్యవహారం. ఇదంతా ప్రేక్షకులకి వినోదం అనుకుంటున్నారనుకుంట!
జంధ్యల గారే బతికుంటే ఎన్ని నూతన పాత్రలకి రూపకల్పన చేసి ఉండేవారో?? ఆయన కూడా ఒక్క క్షణం హన్న! అని ముక్కున వేలేసుకొనే వారు.
అంత విచిత్రంగా ఉంది ఈ కార్యక్రమాల ధోరణి!

ఎడిటింగు అనేది మర్చిపోయినట్టు ఉన్నారు నిర్వాహకులు? లేక కావాలనే ఈ తంతు అంతా మనకు ప్రసారం చేస్తున్నారా? ఏమిటి దీని లోని మర్మం అని ఎంత ఆలోచించినా అర్ధం కావటంలేదు.
ఇదంత సభ్య సమాజం లో నేర్చుకోవలసిన అవసరమైన విద్య? ఇదేనా మీడియా మనకు నేర్పేది? పిల్లలు ఆ ప్రోగ్రములు చూసి అదే ధోరణి నేర్చుకొని, మన మీద ప్రయోగిస్తే మనం దాన్ని స్వీకరించగలమా?

బోడి టీవీ ని అనుకొని ఏమి ప్రయోజనం? ఒకపక్క ప్రజలను పాలించే నాయకులే పబ్లిక్కుగా భయంకరమైన బూతులు మాత్లాడుతుంతే?
యధ రాజా తధ ప్రజా అని ఊరికే అన్నారా?
ఇక పై భవిష్యత్తు క్లాసు పుస్తకాలలో 'వాడుక భాష ' అని ఒక కొత్త సబ్జెక్టు మొదలు పెట్టాలేమొ? అందులో ఒక్కొక్క పాఠం, ఒక్కో ప్రాంతీయ భాషలోని బూతులు, ద్వంద్వార్ధాలు చేర్చాలెమొ? అతిసయోక్తి కాదు.. నిష్టూరమైన నిజం ఇది.
ఎవరు ఎవరిని ఎంత బాగా తిట్టొచ్చు, ఎంత లెవెలుకి అగౌరవ పరచవచ్చు? లేక అవతలి వాళ్ళ ఓర్పు తో పని లేకుండా ఎంత వరకు అహం ప్రదర్శించవచ్చు? ఇలాంటివి కూడా నేర్పితే, ఇంకా బావుంటుంది.
ఇదంత 'కల్చఋ అని మర్చిపోకుందా చెప్పలి.

ఇదే మన 'కల్చరు అని మర్చిపోకుండా చెప్పాలి. సినిమలు అంటే, రాజకీయం అంతే, ఆహ్లాదం కోసమై ఉన్న ప్రాయొజిత కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు, డయిలీ సీరియళ్ళు అంతే, ఎందులో ఈ ధోరణి లేదో అడగండి?
చ, టీవీ పెట్టాలంటే చిరకు వస్తోంది. అన్నీ, అందరూ, ఇంత నీచ స్థిథికి దిగజారి పోవటానికి స్ఫూర్థి ఏంటో, ఎవరో?

7 comments:

Padmarpita said...

మీ సాంపిల్ కన్నా స్ట్రాంగ్ వి మరెన్నో???

విజయభారతి said...

అమెరికా టివి షోస్ ని ఇండియాలో కాపి కొడుతున్నారు. అమెరికా ధనిక దేశం. చైనా నుంచి అవసర/అనవసర సామగ్రిని, ఇండియా నుంచి నిపుణులని దిగుమతి చేసుకుని మరీ అమెరికా వాళ్ళు వింత వింత వినోదాలకు పోతూ ఉంటారు. వాళ్ళ క్రమశిక్షణ, సమయపాలనా, పోరాటపటిమ ఇలాంటివేవి మనకొద్దు కాని, వాళ్ళా విచిత్ర వినోదాలు, పబ్ కల్చర్, వెస్టర్న్ డ్రెస్సింగ్ ఇవన్నీ మాత్రం మనవాళ్ళు బాగా వంటపట్టించుకుంటారు. మనం ఇప్పుడు టివి లో చూసేవన్ని వినోదంలో భాగమే. అందుకే వాటిని ఎడిటింగ్ చేయరు. ఇవాళే నేను 'అందమైన భామలు ' ప్రొగ్రాం 2 పార్ట్స్ చూసాను. ఇది 'అమెరికా టాప్ మోడల్ ' కి నకలు. అది చూస్తున్నంత సేపు, మీకు కలిగిన భావావేశమే నాకు కలిగింది.

--vijaya

The Mother Land said...

This is created by the great ALL IN ONE - Omkar. And the judges, one who know dance and one who deosnt know. Even the participantsare all likes of them.
One interesting point about super singer - I have seen a small kid singing (aged about 6-7yrs)and the judges are finding mistakes in that. Oh man, she is singing at an age where many of us feared to talk. I am appreciating her effort at the same time my appeal to the parents - Please encourage kids, but do not promote them in reality shows. Importantly teach them how to control emotions. - This is important.

rays said...

నిన్న ఈటివిలో ఢీ అనే ప్రొగ్రాం చూశాను...ఒక అయిదుగురు జొకర్లలా వేషాలు వేస్కొని "తకిట తధిమి తందానా " సాగరసంగమం పాటకి డాన్స్ వేశారు..జడ్జస్ అహా వోహో భలే క్రియేటివిటీ అని పొగుడుతున్నారు...ఇంకా ఎలాంటి ప్రొగ్రాంస్ చూడాల్సివస్తుందో...

Vasu said...

"లేక కావాలనే ఈ తంతు అంతా మనకు ప్రసారం చేస్తున్నారా?"

ఖచ్చితంగా కావాలనే. ఈ రోజుల్లో డ్రామా ఉంటే కానీ టి ఆర్ పీ లు పెరగట్లేదని నిశ్చితాభిప్రాయానికి వచ్చేసారు టీవీ వాళ్ళు. ఆట తో మొదలైంది అనుకుంటా ఈ తంతూ. ఆఖరికి సూపర్ సింగర్ కి కూడా పాకింది. చెత్తలా తయారైంది. నాకు హాయిగా ఇక ఇంగ్లీష చానల్స్ చూడడం మంచిది అనిపిస్తోంది. అందులో ఇలాటివి మినహాయించినా బోలెడు మంచివి ఉంటాయి.

antaryagam said...

ల్గొనే వారికి (ముఖ్యం గా పిల్లలకి)విషమ సమస్య గా మిగులుతాయని చెప్పటానికి నేను వెంకాడటమె లేదు.

అవాంచిత, అనారొగ్యకర పోటీ లకి తల్లిదండ్రులే ప్రోత్సహించటం ఈ విష సంస్క్రుతి కి పరాకాష్ట.

అందరు పిల్లలు సంగీతం లోనో, డాన్స్ లోనో నిష్ణాతులు కానక్కర లెదు. వారికి అఏ రంగం లో ఆసక్తి ఉన్నదొ గమనించి ఆ రంగం లో వారిని తీర్చి దిదవలసిన తల్లి దంద్రులు ఈ విధం గా వారి బాల్యం తో ఆడుకోవటం దురద్రుష్టకరం.

చైన దేశం లొ 5 సంవత్సరాల లోపు పిల్లలని అన్ని రకాల రంగాలకి పరిచయం చేసి, వారు ఎందులో ఆసక్తి నైపుణ్యం ప్రదర్సిస్తున్నారో తెలుసుకుని అందులో నే తీర్చి దిద్దుతారుట (ప్రభుత్వం తరపున). అందుకే అక్కడి నించి అంతమంది సూపెర్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి లొ అనేక పతకాలు కైవశం చెసుకో గలుగుతున్నారు.

మన తల్లి దండ్రులు ఆ దిశలో ఎప్పుడు ఆలోచిస్తారో కదా. అలోచించాలని ఆశిద్దము.

బాల్యాన్ని బలి చెయ్యద్దని తల్లి దండ్రులందరికీ ఈ శీర్షిక ద్వారా నా విన్నపం

Unknown said...

namaste vasanthakokila garu... i suppose mee asalu peru sushma rite.. in orkut..( jandhyala gari community) ... coming to this blog...america lo unna vallu dooranga untaru... telugu ni odilestaru.... ani ikkadi vallu deppi podavadaniki ededo antaru kani... ee blogs... mee interest towards telugu lit... sensitive and sensible writings,... chustunte...memu indialo unnaam ani cheppukodam aapeste better anipistundi.... chaala chakkaga visadeekaristunnaaru.... awsome...