Monday, June 29, 2009

రెలా రే రేలా .. దుమ్ము లేపు!!



మా టీవీ వారి ఒక అద్భుత సృష్టి ఈ కార్యక్రమం. ఇదేమి పూర్తి స్థాయి నూతన ప్రయోగం కాదు. మునుపు దూరదర్శన్ లో సాయంత్రం వేళల్లో వచే జనపద పాటల కర్యక్రమం ని అనుసరించి ఉంది. కాని నేటి తరానికి ఏమత్రం తీసిపోకుండా, ఈ మీడియా కాంపిటీటివె ప్రపంచం లో కూడా ఒక శాస్వత కీర్తి ని సొంతం చేసుకుంది.


అట్టడుగున దాగి ఉన్న ఆణిముత్యాలను వెలికి తీసి మనకు అందిస్తున్నారు ఈ అపర జానపద కళాకారులు. కొన్ని పాటల సాహిత్యం వింటుంటే, కంటుంటే, కలిగే అనుభూతి అనిర్వచనీయం.
జాతీత్య స్థాయిలో అవర్డులను సొంతం చేసుకొని, నిజంగా తెలుగు నేల మీద దుమ్ము లేపుతోంది. ఇటువంటి మంచి కార్యక్రమం అందిస్తున్న మా టీవీ వారిని మెచ్చుకొని తీరాలి.

సినిమా సాహిత్యం కి భిన్నంగా మట్టిలోంచి పుట్టిన మాణిక్యాలను సాహితీ ప్రియులకు అందచేసే ఈ కార్యక్రమాం ప్రశంసనీయం. తద్వారా సరైన గుర్తింపు లేక శిధిలమైపొతున్న అద్భుత సాహిత్యాన్ని తిరిగి జీవింపచేస్తున్న ఈ ప్రయతనం చాలా గొప్పది.


రెండు దరువులు విజయవంతంగా పూర్తి చేసుకుని, మూడవ దరువులోకి అడుగుపెట్టిన ఈ కార్యక్రమం అనతి కాలంలోనే అందరి అభిమానాన్ని చూరగొన్నది అనటంలో ఆస్చ్రయం లేదు.దీనికి ప్రత్యక్ష సాక్షులు రెండవ దరువు ఫయినల్స్ కి వేంచేసిన కళాభిమానులైనటువంటి వేల మంది ప్రేక్షకులే!!
రాష్ట్ర నలుమూలల జల్లెడ బట్టి ఆయా ప్రాంతీయ భషలలొ, యాసలలొ అద్భుత జానపదాలను వెలికితీస్తున్నారు.
అమ్మమ్మలు, తతమ్మల తరాలలతో ఆ పాటలు కూడా అంతరించిపోకుండా, ముందు ముందు తరాలు అవి నేర్చుకుంటారని, కాల చక్రంతో పాటే ఆ సాహిత్య సంపద తిరుగుతూ ఉంటుందనీ ఆశిద్దాం.
సాహిత్య పరంగా కొన్ని పద ప్రయోగాలు నిజంగా అద్భుతాలే.
రేలా రే రేలా కి జయ హో!

Image courtesy: http://idlebrain.com/

2 comments:

Uyyaala said...

చాలా బాగా రాశారు.
మన జానపద సాహిత్యం ఇంట సుసంపన్నమైనదా అని ఆశ్చర్యం కలుగుతోంది.
ఆ బాణీలు, మాండలిక పద విన్యాసం , జానపద భావ సౌందర్యం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది.
మీరన్నట్టు నిజంగా ఇదొక గొప్ప పదహారణాల తెలుగు కార్యక్రమం.
గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, ఉదయ భాను ఈ కార్యక్రమానికి మరింత శోభను సమకూరుస్తున్నారు. అభినందనలు.

పుల్లాయన said...

నాకు కూడా ఈమధ్య కాలంలో టివి లో నచ్చిన ఎకైక కార్యక్రమం. కచ్చితంగా మా టివి వాళ్లని అభినందించాల్సిందే.
ఇంకో విషయం ఏంటంటే ఈ జాన పద పాటలు వింటున్నప్పుడు వచ్చే ఊపు అంతా ఇంతా కాదు. సినిమా పాటలు కూడా ఆగవు ఈ ఊపు ముందు. మళ్లి ఈ పాటలు కూడా చాల అర్ధవంతంగా ఉంటాయి. అయినా మన తెలుగు సినిమా వాళ్లు ఇలాంటి పాటలని వదిలేసి చెత్త హిందీ పల్లవులతో పాటలు రాయటం దారుణం.