Monday, February 9, 2015

A New Experience!!

"తల పైకెత్తితే, హట్టాత్తుగా కనపడతాడు చందమామా!!..
aa experience is always new. తరచూ జరిగినా..ఎప్పుడూ కొత్తే"! "ఈ సారి ఇంకో విధంగా చూశాను. 50 % bigger and 30 % brighter moon. ఈ వారం అంతా ఇంతేట! వార్తల్లో చెప్పారు.

ఇంటి నుంచి బయటికి రాగానే భయం వేసేలా కనిపించాడు నెలరాజు.కలయా నిజమా అన్నట్టు ఉన్నాడు.

మా ఊరిలో ఉన్న 'kopernik observatory' లో చాలా powerful telescope ఉందనీ, అది శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి, శనివారం ఉదయం 6 గంటల వరకు అందరికీ అందుబాటులో ఉంటుందని నా స్నేహితురాలు మొన్న చెప్పగా విన్నాను. what a coincidence? అనుకున్నాను.

సాయంత్రం పని ముగించుకొని, ఇంటికి తిరిగి వెళ్తుండగా, అకస్మాత్తుగా తట్టింది, ఇవాళ్ళ 'శుక్రవారం' అని! inti daari వెంటనే ఆ observatory వైపు బండిని మళ్ళించాను. చీకటి, మలుపులు, చాలా ఉద్వేగవంతంగా సాగింది సవారి! వెళ్ళగా, వెళ్ళగా దాదాపు ఒక పది మైళ్ళు వెళ్ళానేమొ. ఎపుడూ రాని ప్రదేశం, కనుక మునుపెరుగని సందులు, రోడ్లు. ఒక్క నిముషం ఈ సాహసం సరైనదేనా అని సందేహపడ్డాను. ఎంత వెళ్ళినా తరగని దూరం లా అనిపించింది.

ఒక చిన్న ఘాట్ రోడ్ మీద కొన్ని మలుపులు తిరిగాక మొత్తానికి గమ్యానికి చేరుకున్నాను. బయట అంతా నిశబ్దంగా, నిర్మానుష్యంగా ఉంది.మెల్లగా, లోపలికి వెళ్ళాను. ఓయమ్మో! ..దాదాపు 50 నించి 60 జనాల వరకు ఉన్నారు లోపల. బయటికి, లోపలికి ఇంత వ్యత్యాసమా అనేల! ఏదో బస్సు ఎక్కి విహార యాత్రకి వచ్చినట్టు వచ్చారు జనాలు.

నిర్వాహకుడిలా అనిపించిన ఒకాయన్ని అడిగను, "ఎమిటీ హడవుడి?",అని! ఇవళ్ళ, live astronaut తో ముఖా-ముఖీ. అందుకే ఈ హడావుడి, అన్నాడతను. బావుందన్నాను నేను... ఇక్కడ telescope ఉందిట? అందులోంచి చంద్రుడిని చూడవచ్చట?, నిజమేన? అని అడిగాను. " ఓ యస్! తప్పకుండానూ. ఆగండి!, ఏర్పాటు చేస్తాను", అని లోపలికి వెళ్ళాడాయన.

చాలా ఆశక్తిగా అనిపించింది ఆ క్షణం. ఈ లోగా ఆయన ఒక assistant ని వెంటబెట్టుకొని, బయట ఒక observatory లాంటి ఒక చిన్న గది లోకి దారి చూపించాడు. ఆ గది మధ్యలో ఒక పెద్ద గొట్టం ఆకాశం వైపు చూస్తున్నది. అదే telescope అని అర్ధమైంది. అది చాలా పెద్దదిగా ఉన్నది. చూట్టూ చాలా computers ఉన్నాయి.వెంటనే ఆదిత్య 369 సినిమా లో time machine గుర్తొచ్చింది. ఎదో మాయా లోకానికి తీసుకుపోబోతున్న పుష్పకం లా!!

తీరా బయటికి వచ్చి చూస్తే, చంద్రుడు ఇంకా ఈ observatory ఉన్న ground level కి రాలేదు అన్నాడు assistant. "అదేంటి, నాకు రోడ్ మీదికి కనిపించాడే", అన్నాను, నేను! "మధ్యలో కొండలు ఎక్కారు, మర్చిపోయారా?" , నవ్వుతూ అన్నాడు అతను."కాసేపు ఆగాలి, ఈ లోపున కొన్ని వేరే గ్రహాలు, నక్షత్రాలు చూద్దాం", అన్నాడు.

అబ్బా తినబోయే ముందు నిరీక్షణ అంటే ఇదే! కానీ ఏం చేస్తాం? ఇంత దూరం వచ్చి? వేచి చూడాల్సిందే అని ఊరుకున్నాను. చంద్రుడు ఇంకా పెద్దగా కనిపిస్తాడేమొ అని నిలబడే కలలు కనటం మొదలుపెట్టాను. ఈ లోపున కొంతమంది పిల్లలు, పెద్దలు పోగయ్యారు ఈ సందడికి. ఆ assistant మమ్మల్ని పిలిచి కొన్ని galaxies, నక్షత్రాలు, ఇతర గ్రహాలు చూపించాడు. భలే ఉన్నాయి అవి. కింద ముగ్గు పిండి జల్లినట్టు, రేణువులు కనిపిస్తూనే, తెల్లగా అలికేసినట్టు ఉన్నాయి galaxies - group of stars!! సాయంత్రం 6-30, 7 ఇంటికి వస్తే, saturn,jupiter కనిపిస్తాయన్నాడు.ఈసారి ప్రయత్నించాలి అనుకున్నాను.

మొత్తానికి వెచి చూసిన క్షణం రానే వచ్చింది. చంద్రుడు నడి మింటికి చేరుకున్నాడు. telescope కి ఉండే eye piece(చూసే సాధనం) దగ్గరకు కన్ను పోనిచ్చాను. తెల్లని కాంతి కి కళ్ళు మూసేసుకోవలసి వచ్చింది. ఆ కాంతి కి కళ్ళు చెమ్మగిల్లాయి కూడా!కళ్ళు తుడుచుకొని, మళ్ళీ eye piece లోంచి చూడ ప్రయత్నించాను.


బూడిద రంగులో.. ఒక తెల్లని, మాసిన ప్రదేశం కనిపించింది. చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాట్టు ఉంది ఆ ప్రదేశం అంతా! ఇదేమిటి? అని అడిగాను ఆ assistant ని ! "అదే చంద్రుడి surface అన్నాడతను. మీరు చూస్తున్నవీ , 'craters' అంటారు. అవి లోతైన గోతులు. చాలా పెద్దవి. ఒక విధంగా చెప్పాలంటే అఖండమైన లోయలు. అలాగే కొండలు కూడా ఉంటాయి", అని వివరించాడు.

అక్కడే ఉన్న ఒక పిల్లాడు, ' అవును, మన భూమి మీద ఇలాంటి craters ఒకటో రెండో ఉన్నయి. అదే చంద్రుడి మీద చాలా ఉన్నాయి, అన్నాడు!

ఓరినీ.. మనం ఇంతగా చూసి పొంగిపోయే చంద్రుడు నిజంగా అందగాడు కాదన్నమాట? అంతా బూడిదే.. పైగా గోతులు, కొండలన్నమాట!, కాని ఇక్కడికి ఎంత అందంగా తెల్లగా కనిపిస్తాడు? మెరిసిపోతున్నట్టు?

నిజం... మన భూమి ఎంతో అందమైనది. మిగతా సూన్యానికి ఇదొక నీలపు వర్ణ వజ్రం. ఎంతో రమణీయం గా ఉంటుంది. ఇదిగో చిత్రం చూడంది. ఇది చంద్రుడి మీది నించి తీసినది., అని భూమి చిత్రం ఒకటి చూపించాడు!.


  కళ్ళకు కనిపించేది అంతా నిజం కాదని చెప్పటానికి ఇదే గొప్ప నిదర్శనం అనుకున్నాను. ఎంతో ఆశగా వస్తే ఇదేమిటి అన్నను ప్రకాశముగా! దూరపు కొండలు నునుపు అన్న సామెత ఎంత సత్యమో అనుకున్నాను. మొత్తానికి మరువలేని ఒక అనుభూతి మిగిలించింది చంద్రుడి దర్శనం!!

No comments: