Monday, July 25, 2016

వడ దెబ్బ !!



గుండమ్మ కధలో నాగేస్వర్రావు లాగా ఈ పూట గారెలు తినాలని కోర్కె పుట్టింది ..
తీరా చూస్తే మినపప్పు డబ్బా లో
ఎక్కడో అడుగున ఉన్నాయి ఓ చారెడు మినువులు 󾰴

అవి నాకేసి జాలిగా చూశాయి .. మావల్ల ఏమవుతుంది అన్నట్టు ! 🤔

'మర్ఫీస్ లా ' అంటే ఈదేనేమో అనుకున్నా మనసులో 󾌯

గమనిక : మా ' విల్లేజ్ ఆఫ్ జాన్సన్ సిటీ ' లో ఉన్న పప్పు దుకాణం కి ఆవేశం గా వెళ్ళాను - పట్టు వదలని విక్రమార్కుడి ని ఆదర్శంగా తీసుకొని

మిస మిస లాడే మినపందం మిస్సు కాకొయి సాయంత్రం అన్నాడో సినిమా కవి .., పేరు గుర్తులేదు 󾌿
ఆ తీరుగ నానబోసి .. మా వారికి పిల్లలకి ఆ సందేశమే పంపి మిగిలిన పనులకి పూనుకున్నను నేనూ .. వాటితో నానే ఉద్దేశాన్ని అతి కష్టమ్మీద విరమించుకొని ! 󾌻

వడలా మజాకా 󾆶🏻??

జమున లాంటి గొప్పింటమ్మాయే అంట్లు తోమి,
ఎస్ .వీ . రంగారావు లాంటి భారీకాయం తో తలపడి మరీ సాధించుకుంది .. ఊరికే వదిలేయగలమా ?
విజయా సంస్థ బాధపడదూ?? 󾍃

ఆత్రమో ఆవేశమో ఆనందమో దు:ఖమో
పది పదంటే పది లెక్కపెట్టమన్నాడు ప్రభుదేవా
అన్ని మర్చిపోయి ఉష్ ఫటాక్ అని చేశా ...
ఇదిగో ఇలా అయ్యాయి ఇవి ..

వీటిని గారెలంటారా?? 🙃󾍁󾌽
గారెకి చిల్లే కదా అందం ??󾌣

అన్నట్టు తుది మెరుగు మరిచితిని ...
ఈ సదరు వడలు తింటుండగా మా అమ్మయి మొదటి పన్ను ఊడినదోచ్!!

నెల రోజులనించి ఊడనని మొరయించిన పన్ను , నీ వడ దెబ్బతో ఇట్టే ఊడిందని చెంగు చెంగున వెళ్ళింది నా గారాల పట్టీ..!

No comments: