Monday, July 25, 2016

సాలోచనీయం !

సాలోచనీయం !

ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడుల్స్ , ఇన్స్టెంట్ గులాబీ జామున్ మిక్స్ .. ఇంకాస్త ముందుకుపోతే ఇన్స్టెంట్ పెళ్లి, ఇన్స్టెంట్ కాపురం, ఇన్స్టెంట్ విడాకులు..! నేటి యువతరం ఈ పెడదారిన పయనిస్తున్నారని ఎక్కువగా వినికిడి! ఏ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా .. ఈ తరం ఇలా, ఈ తరం అలా.. అని ఒకలాంటి అసహనం వ్యక్తపరుస్తున్నారు . బాబోయి ఇలాంటి ప్రపంచంలోనా నా పిల్లలు పెరగబోయేది అని యంగ్ తల్లి తండ్రులు నోళ్లు వెళ్ళబెడ్తున్న తరుణాలు చాలానే ఉన్నాయి.

వార్తాపత్రికల్లో వచ్చే కథలు, కాకరకాయలు, పీచుమిఠాయిలు, చాలా మటుకు ఈ టాపిక్కులనే స్కాన్ చేస్తున్నాయి.

ఈ మధ్య నేను చుసిన కొన్ని సినిమాలు మాత్రం నన్ను ఆలోచింపజేశాయి.
'అందరి బంధువయా' , మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు, రాజాధి రాజా, కృష్ణం వందే జగద్గురుమ్ , oye , కొన్ని మచ్చుతునకలు! ...

అంతా ఇన్స్టెంట్ కాదని, ఈ తరం లోను ఒకలాంటి బ్యాలెన్సుడ్ ప్రవర్తన కూడా ఉందని; ఒక సమస్య వస్తే నిలబడి ఆలోచించటం సాధ్యపడుతుందని; క్షణికానందాలకి లొంగిపోకుండా, ఆగి ఆచి తూచి అడుగేయగలరని, అవసరమైతే అలవి కాని త్యాగాలు కూడా చేయగలరని ప్రత్యక్షంగా చాటాయి ఈ సినిమా కాదాంశాలు!

నటీ నటులు సాంకేతిక వర్గం యువ + మధ్య వయస్కులే అనుకుంట ! తెర వెనుక ఆయా సంబంధిత వర్గాలకి అలాంటీ ఆలోచనా ఒరవడి మీద నమ్మకం లేకపోతే అది తెరకెక్కించే సాహ్సం చేయరు

అలాగే రచయితలు అలాంటీ కధలని పాత్రలని ఆలొచిస్తున్నరన్నదే ఈ positive vibration కి పునాది ! చెడుకి పక్కగానే మంచి ఉంటుందనటానికి ఇదే మంచి ఉదాహరణ
నిలకడా ధోరణి పూర్తిగా అంతరించి పోవట్లేదు అని ఊపిరి పీల్చుకోవచ్చు !

చిన్ననాటి తీయని జ్ఞాపకాలు ..

కాంతమ్మ గారు అడిగారని రాయటం మొదలు పెట్టాను ..
చిన్ననాటి తీయని జ్ఞాపకాలు ..

వేసవి సెలవుల్లో సరదా సంఘటనలు ఎన్నో ..

నేను , మా స్నేహ బృందం ఒకసారి వెనుకింటి మామిడికాయల వేటకు బయల్దేరాం. ఆ ఇంటికి రాములవారు ఓనరు, హనుమంతులవారు కాపలాదారు ! ఇక్కడ హనుమంతుల వారి నిజనామము 'రాముడు ' 🤓అతను అక్షరాల ఆ కొసరు రాములవారికి సిసలైన బంటేను ! ఆయన మీద ఈగనైనా వాలనివ్వడు ! ఇంక ఆయన తోటలో ఒక కాయ కోయడమంటే బహు సాహసమే సుమా !

ఐనా వెనుచూపని విక్రమార్క చక్రవర్తిలా ముందడుగేసుకుంటు రహస్య మార్గాన బయల్దేరాం .
చెట్టు దగ్గరకు వెళ్ళాలంటే - అచ్చంగా హనుమంతులవారున్న పెంకుటిల్లు పైకప్పు మీద అతి జాగ్రత్తగా అడుగులేసుకుంటూ వెళ్ళలి మరి !

ఎండిన ఆకులు , పైకి లేచిన మేకులు మాకు ఏ మాత్రము సహకరించట్లేదంటే నమ్మండి !

ఏన్నో తంటాలు పడి ఒక్క కాయ కోశాం ! వెనక్కి తిరిగి వస్తుంటే . హనుమంతులవారు మధ్యాన్న భోజనం కానించి చేయుకడుగు కార్యక్రమానికై బయటికి వచ్చరు ! అంతే పైకప్పు మీద మమ్మల్ని చూశారు .

లగెత్తండహో అని ఒక్క war cry సంధించి పరుగందుకున్నాం అందరం

రాముడు ఒక్క అంగలో గోడ దూకి మాలొ ఒకరిని జబ్బపట్టుకొని గద్దించాడు , హన్నా అని !

గబుకున్న కాయ కాస్త పక్కనే ఉన్న drainage కాలువ లో పడేశాడు మా అయోమయం !

కత్తి పోయి ముల్లు మిగిలే ఢాం ఢాం ఢాం !!

అది సంగతి!

వడ దెబ్బ !!



గుండమ్మ కధలో నాగేస్వర్రావు లాగా ఈ పూట గారెలు తినాలని కోర్కె పుట్టింది ..
తీరా చూస్తే మినపప్పు డబ్బా లో
ఎక్కడో అడుగున ఉన్నాయి ఓ చారెడు మినువులు 󾰴

అవి నాకేసి జాలిగా చూశాయి .. మావల్ల ఏమవుతుంది అన్నట్టు ! 🤔

'మర్ఫీస్ లా ' అంటే ఈదేనేమో అనుకున్నా మనసులో 󾌯

గమనిక : మా ' విల్లేజ్ ఆఫ్ జాన్సన్ సిటీ ' లో ఉన్న పప్పు దుకాణం కి ఆవేశం గా వెళ్ళాను - పట్టు వదలని విక్రమార్కుడి ని ఆదర్శంగా తీసుకొని

మిస మిస లాడే మినపందం మిస్సు కాకొయి సాయంత్రం అన్నాడో సినిమా కవి .., పేరు గుర్తులేదు 󾌿
ఆ తీరుగ నానబోసి .. మా వారికి పిల్లలకి ఆ సందేశమే పంపి మిగిలిన పనులకి పూనుకున్నను నేనూ .. వాటితో నానే ఉద్దేశాన్ని అతి కష్టమ్మీద విరమించుకొని ! 󾌻

వడలా మజాకా 󾆶🏻??

జమున లాంటి గొప్పింటమ్మాయే అంట్లు తోమి,
ఎస్ .వీ . రంగారావు లాంటి భారీకాయం తో తలపడి మరీ సాధించుకుంది .. ఊరికే వదిలేయగలమా ?
విజయా సంస్థ బాధపడదూ?? 󾍃

ఆత్రమో ఆవేశమో ఆనందమో దు:ఖమో
పది పదంటే పది లెక్కపెట్టమన్నాడు ప్రభుదేవా
అన్ని మర్చిపోయి ఉష్ ఫటాక్ అని చేశా ...
ఇదిగో ఇలా అయ్యాయి ఇవి ..

వీటిని గారెలంటారా?? 🙃󾍁󾌽
గారెకి చిల్లే కదా అందం ??󾌣

అన్నట్టు తుది మెరుగు మరిచితిని ...
ఈ సదరు వడలు తింటుండగా మా అమ్మయి మొదటి పన్ను ఊడినదోచ్!!

నెల రోజులనించి ఊడనని మొరయించిన పన్ను , నీ వడ దెబ్బతో ఇట్టే ఊడిందని చెంగు చెంగున వెళ్ళింది నా గారాల పట్టీ..!