Monday, July 25, 2016

చిన్ననాటి తీయని జ్ఞాపకాలు ..

కాంతమ్మ గారు అడిగారని రాయటం మొదలు పెట్టాను ..
చిన్ననాటి తీయని జ్ఞాపకాలు ..

వేసవి సెలవుల్లో సరదా సంఘటనలు ఎన్నో ..

నేను , మా స్నేహ బృందం ఒకసారి వెనుకింటి మామిడికాయల వేటకు బయల్దేరాం. ఆ ఇంటికి రాములవారు ఓనరు, హనుమంతులవారు కాపలాదారు ! ఇక్కడ హనుమంతుల వారి నిజనామము 'రాముడు ' 🤓అతను అక్షరాల ఆ కొసరు రాములవారికి సిసలైన బంటేను ! ఆయన మీద ఈగనైనా వాలనివ్వడు ! ఇంక ఆయన తోటలో ఒక కాయ కోయడమంటే బహు సాహసమే సుమా !

ఐనా వెనుచూపని విక్రమార్క చక్రవర్తిలా ముందడుగేసుకుంటు రహస్య మార్గాన బయల్దేరాం .
చెట్టు దగ్గరకు వెళ్ళాలంటే - అచ్చంగా హనుమంతులవారున్న పెంకుటిల్లు పైకప్పు మీద అతి జాగ్రత్తగా అడుగులేసుకుంటూ వెళ్ళలి మరి !

ఎండిన ఆకులు , పైకి లేచిన మేకులు మాకు ఏ మాత్రము సహకరించట్లేదంటే నమ్మండి !

ఏన్నో తంటాలు పడి ఒక్క కాయ కోశాం ! వెనక్కి తిరిగి వస్తుంటే . హనుమంతులవారు మధ్యాన్న భోజనం కానించి చేయుకడుగు కార్యక్రమానికై బయటికి వచ్చరు ! అంతే పైకప్పు మీద మమ్మల్ని చూశారు .

లగెత్తండహో అని ఒక్క war cry సంధించి పరుగందుకున్నాం అందరం

రాముడు ఒక్క అంగలో గోడ దూకి మాలొ ఒకరిని జబ్బపట్టుకొని గద్దించాడు , హన్నా అని !

గబుకున్న కాయ కాస్త పక్కనే ఉన్న drainage కాలువ లో పడేశాడు మా అయోమయం !

కత్తి పోయి ముల్లు మిగిలే ఢాం ఢాం ఢాం !!

అది సంగతి!

No comments: